#IsBossAlwaysRight???

ఒక కుక్క పిల్లని చంపాలంటే ముందు అది పిచ్చిదని ముద్ర వేయాలి.
ఇంతకీ నువ్వా కుక్క పిల్లవై,
నిన్ను చంపాలనుకున్నది నీ బాస్ అయి ఉండినచో... ఇంకా తేలిక సుమీ. నువ్వు చేసినవన్నీ హఠాత్తుగా తప్పులై పోతాయి. నువ్వు రెండు రెళ్ళు నాలుగన్నా అతనికి నచ్చదు. అతను రెండు రెళ్ళు ఆరన్నా నీకు వప్పుకోక తప్పదు.
నీ ఖర్మ కాలి నువ్వు ఆడపిల్లవి కాబట్టి అతనికి ఇంకా తేలిక. నీ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా పదునైన ఆయుధం. అది సెనైడ్ కన్నా ప్రమాదకరం. క్షణాల్లో నీ ధైర్యాన్ని చంపేస్తుంది.
నువ్వు ఆడపిల్లవి కాబట్టి స్వతహాగా సున్నితంగా ఉంటావు కాబట్టి కన్నీళ్ళు పెట్టుకున్నావనుకో... ఇక చూడు.. హాస, దరహాస.. వికటాట్ట హాసాలు. హమ్మయ్య ఇంక అతని ఈగో బోలెడంత సంతృప్తి పడినట్లే.
దాదాపు అన్ని ఆఫీసుల్లోనూ ఇది చాలా చాలా మామూలై పోయింది. యూనియన్లు లేని, ఉన్నా బలంగా లేని సంస్థలలో అయితే ఈ బాసిజం వికృత పోకడలకి అంతే లేదు.
ప్రతీ వర్క్ ప్లేస్ లోనూ.. harrassment at work place గురించి కమిటీలు ఫార్మ్ చేస్తున్నారు. అయితే ఈ చట్టం కిందకి ఎలాంటి వేధింపులు వస్తాయి. ఇది ఎప్పుడూ చాలా కన్‌ఫ్యూజన్ నాకు.
వర్క్ విషయం లో వేధింపులు అసలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయా.
"విమెన్ ఎంప్లాయీ కాబట్టి నేను కంఫర్ట్ గా ఫీల్ అవ్వట్లేదు. నాకు మేల్ సబార్డినేట్ ని ఇవ్వండీ అని మన బాస్ అన్నాడనుకోండి. అది మన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసినట్లు కాదా. నేనేవిషయంలో తక్కువ? అని ఆమె హ్యుమిలియేషన్ ఫీల్ అయితే అది harraassment at work place కిందకు వస్తుందా.
ఆఫీసు సమయం దాటిన తర్వాత కూడ పని ఉంది నువ్వు తప్పనిసరిగా ఆఫీసులో ఉండాలి అని మన మేనేజర్ అంటే దానిని మనం భాధ్యతగా తీసుకోవాలా.. మనకి ఇంట్లో తల్లిగా భార్యగా చాలా భాధ్యతలు ఉంటాయి. అవి మనం నెరవేర్చుకోవాలి కదా అన్నప్పుడు.. " అందుకే విమెన్ ఎంప్లొయీ నాకు వద్దన్నాను" అని బాస్ అంటే అది దేని కిందకు వస్తుంది.
"నువ్వు నీ ఎబిలిటీ ప్రూవ్ చేసుకోవాలంటే రాత్రీ పగలూ ఆఫీసులో ఉండు. లేకపోతే తప్పుకో "అంటే మనం దానిని ఎలా అర్ధం చేసుకోవాలి. నిజంగా రాత్రీ పగలూ ఆఫీస్ లో ఉండి outstanding పెర్ఫార్మన్స్ ఇచ్చినా దానిని మన క్యారెక్టర్ ని కించ పరచడానికో లేక మన వ్యక్తిగత బాధ్యతలని పల్చన చేయడానికో వాడుకున్నారనుకోండి. అప్పుడు మన పరిస్ఠితి ఏమిటి?
కేవలం ప్రైవేట్ సెక్టార్స్ కాదు. యూనియన్లు లేని, ఉన్నా బలంగా లేని అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా జరుగుతున్న వేధింపులివి.
గట్టిగా మాట్లాడితే మన ఎబిలిటీస్ ని ప్రశ్నించడం. లేకపోతే మన సున్నితత్వాన్ని హేళన చేయడం. ఇవన్నీ కాక పోతే మన కెరీర్ ను ప్రమాదం లోకి నెట్టివేసే రిపోర్టులు మన మీద తయారు చేయడం.
మనం ఎంత వర్క్ చేశామన్నది ఎంత క్వాలిటీ తో చేసాం అన్నది, మనం కూర్చున్నది ఏ చైర్ లో అన్న దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది తప్ప మన పెర్ఫార్మన్స్ ని బట్టో ఆటిట్యూడ్ ని బట్టో కాదు.
Yes… Because he is boss
And after all we are ordinary female subordinates. 
No democratic approach than this 
ఇంకా గట్టిగా ఏమన్నా అంటే బోలెడు వ్యక్తిత్వ వికాస సూత్రాలు, పాజిటివ్ ఏటిట్యూడ్‌లూ.. మార్కెట్లో ఉన్నాయిగా పుంఖాను పుంఖాల పుస్తకాలు. మనమో Narrow Minded creature. According to the stream పరిగెత్తలేని Looser.
వత్తిడులకి తట్టుకోలేక , పరిస్థితులకి Succumb అయ్యేలా చేయడం ఇలాంటి బాస్ ల సైకలాజికల్ గేమ్. మనం లొంగామా లేదా అన్నది వాళ్లకి అనవసరం. వాళ్లకి ఎప్పుడూ ఒక టార్గెట్ కావాలి. ఆ టార్గెట్ ఎంతటి బలమైన వ్యక్తిత్వం ఉన్నదైతే అంతటి పైశాచిక ఆనందం వీళ్ళకి. 
సరే!! ఇవన్నీ తట్టుకుని, విసిగి వేసారి ఒక కంపైంట్ గానీ ఇచ్చామా... ఇంక అంతే సంగతులు. మనమే ఇంక Talk of the Office. మనకి ఒక Fear of social defeat. ఇదంతా ఒక సైకలాజికల్ ట్రామా.
ఇవన్నీ కాకుండా.. టార్గెట్లు. మార్కెట్ లో మన నంబర్ మెరుగు చేసుకోవడం. బిజినెస్ పెంచుకోవడం. వీటికోసం ఎంతైనా దిగజారి పోవడం. .
కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా తాము నిర్దేశించుకున్న తమ లక్ష్యాలకి అనుగుణంగా, ఉద్యోగుల చుట్టూ కనిపించని సంకెళ్ళని వేసి వాళ్ళని తాము అనుకున్న పరిధిలోకి తెచ్చుకునే ఒక వ్యాపార సూత్రం.
తాము టార్గెట్ చేసిన ఉద్యోగులంతా తాము నిర్మించిన బారియర్స్ లోనే పని చేస్తూ, తమని విజయ సోపానాల మీద నడిపించే సమిధలవ్వాలనే ఒక నవీన వ్యాపారమంత్రమిది.

Hell with this pressures…
I Really wonder why boss is always right






No comments