ఒక సారి ఆలోచించండి!!



'కాళ్ళ మీదకి బొట్లు బొట్లుగా రక్తం కారుతుండగా నేను చేస్తున్న ఈ పరుగు... నొప్పి, కడుపు మెలిపెడుతున్న భాద ఉన్నా సరే అది బైటికి కనబడనీయకుండా పనులు చేసే నా అక్క చెల్లెళ్ళ కోసం.. టాఫూన్లు, శానిటరీ ప్యాడ్లు అందుబాట్లులో లేని కోట్లమంది సోదరీమణుల కోసం"
---కిరణ్ గాంధీ...

మనసు ఎంత కదిలిపోతోంది!!!

హ్యాపీ టూ బ్లీడ్....

ఈ మధ్య కాలంలో రోహిత్ మరణం తర్వాత బహుశా ఎక్కువ చర్చకు వచ్చిన విషయం.

నాకయితే నికితా అజాద్.. తృప్తీ దేశాయ్..కిరణ్ గాంధీ... ఇంకా ఈ క్యాంపెయిన్ చేస్తున్న అందరూ భలే నచ్చేసారు.
కానీ చాలా భాద పెడుతున్న అంశం ఈ ఉద్యమం మీద జరుగుతున్న దాడి. అంతకన్న ఎక్కువగా బాధపెడుతున్నది మహిళలే కొంత మంది ఎటాక్ చేయడం.


వాళ్ళంటున్నట్లు... నిజమే ఈరోజు సమాజంలో ఉన్న అనేక సమస్యలతో పోలిస్తే ఆలయ ప్రవేశానికి అర్హత కల్పించలేకపోవటం చాలా చిన్న విషయం...అంతకన్న తక్షణ సమస్యలున్నాయి. అయితే కావచ్చునేమో... 


కానీ...


దీనిని మరో కోణంలో చూసి తీరాలి.


గుళ్ళోకి వెళ్ళడం ... వెళ్ళలేక పోవడం ఒక ప్రతీక మాత్రమే..


అసలు విషయం అది "మలినం" అని సమాజం... అందులో చాలా మంది ఆడవాళ్ళు ఇప్పటికీ నమ్మడం.
ప్రకృతి సహజంగా ప్రతీ ఆడవారిలో కలిగే ఒక సహజమైన సైకిల్ కి... ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మామూలు శారీరక ఇబ్బందికి.. ఇంత పెద్ద వివక్షా??? 


ఈ సమస్యలో ఆడవాళ్ళను బాధించే ఆత్మన్యూనతకు.. దేహ న్యూనతకు సంబంధిచిన బీజాలున్నాయని మనం అర్ధం చేసుకుంటే మనలో ఎవరం ఈ క్యాంపెయిన్ ని వ్యతిరేకించం.


ఏదైనా ఉద్యమాన్ని విమర్శించేటప్పుడు ఆ ఉద్యమం తప్పు ధోరణిలో వెళ్తోందంటే మనం విమర్శించొచ్చు...
దానివల్ల నష్టం జరుగుతుందని అనిపిస్తే మనం దూరంగా ఉండొచ్చు...
కానీ... కేవలం "సిల్లీ" అని మనం ఏ ఉద్యమాన్నీ చిన్నబుచ్చకూడదేమో...
ఒక సారి ఆలోచించండి!!



No comments