గో కిస్ ద వరల్డ్ - సుబ్రతో బాగ్చి


సాహిత్య స్వభావమే వికాసం- ఎంత చిన్న పుస్తకమయినా , ఎంత పెద్ద పుస్తకమయినా అందులోంచి నేర్చుకోవలసినదీ , తెలుసుకోవలసినదీ ఎంతో కొంత ఉంటుంది. పరిజ్ఞానం వ్యక్తిత్వ వికాసం లోనూ పనికి వస్తుంది. ఐతే అలాంటప్పుడు ప్రత్యేకం గా వ్యక్తిత్వ వికాస సాహిత్యమెందుకుఅన్న ప్రశ్నకు సమాధానం సిద్ధం గానే ఉంటుంది..

సముద్ర గర్భం లోని నిధి నిక్షేపాలను వెలికితీయడానికి బలం గా వల విసిరామనుకోండి. అందులో చేపలు పడవచ్చు, రాళ్ళూ రప్పలూ పడవచ్చు . అదృష్టం బాగుంటే బంగారమో, వజ్రాలో పడవచ్చు. కానీ అవకాశాలు అంతంత మాత్రమే. అదే ఒక పారా తట్టా పట్టుకొని వజ్రాలగనికో వెళ్ళామనుకోండి..  తవ్వేకొద్దీ అమూల్య సంపదే..  వ్యక్తిత్వ వికాస గ్రంధాలకూ, మిగతా సాహిత్యానికీ ఉన్న తేడా ఇలాంటిదే.వంద పేజీల పుస్తకాన్ని చివరదాకా చదివితే అందులొ మనకు ఉపయోగపడే విషయం మూలో కొంచెం ఉండవచ్చు. లేదంటే రచయిత విషయాన్ని పైపైన చర్చించి మిగతాది మన అవగాహనకు వదిలేసి ఉండవచ్చు. కానీ వ్యక్తిత్వ వికాస సాహిత్యం అలా కాదు. ఇది ఒక రకంగా షడ్రుచులు వండి సిధ్ధం గా ఉంచిన బఫే భొజనం లాంటిది. మనకు కాలవసినది కావలిసినంత వడ్డించుకోవడమే. అలాంటి, ఒక అద్భుతమయిన , వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పుస్తకం వారం మీకు పరిచయం చేయబోతున్న  " గో కిస్ వరల్డ్"మైండ్ ట్రీ వ్యవస్థాపకుడైన సుబ్రతో బాగ్చి తల్లి తనతో అన్న చివరి మాటలనే శీర్షిక గా తీసుకుని రాసిన పుస్తకం " గో కిస్ వరల్డ్"

సుబ్రతో తల్లి చివరి ఘడియలలో ఆస్పత్రి లో వైద్యం పొందుతూ ఉంటుంది.సెలవు పై వచ్చిన సుబ్రతో 15 రోజుల పాటు తల్లికి సపర్యలు చేస్తారు. ఆఫీసు నుంచి అర్జంటు గా రమ్మని కబురు రావడంతో తప్పనిసరై బయలుదేరుతూ చివరిసారి గాతల్లి వద్దకు వెళ్ళి  తాను అత్యవసరం గా వెళ్ళవలిసి  వస్తోందనీ , క్షమించమనీ అడిగి ఆమె నుదుటి పై ముద్దు పెట్టుకుంటారు. అందుకు ఆమె వణుకుతున్న కంఠం తో " చుము క్యామో కాచో ? -( నన్నెందుకు ముద్దాడుతున్నావు ?) " అని అడుగుతుంది.. " క్యాబోనా క్యానో ( ఎందుకు పెట్టుకోకూడదూ !)  అని అడుగుతారు సుబ్రతో బాగ్చి ఆశ్చర్యంగా.అందుకు ఆమె మెల్లగా కొడుకు చెయ్యి నిమిరి, "జావో జగత్ తాకే చుము ఖావో - (గో కిస్ వరల్డ్)"   అంటుంది.
అవే ఆమె చివరి మాటలు.

తల్లి మాటలు సుబ్రతోలో తీవ్ర సంఘర్షణను కలిగిస్తాయి. వీధి బడిలో కేవలం చదవడం, వ్రాయడం మాత్రమే నేర్చుకున్న అతని తల్లి ఐదుగురి పిల్లల తల్లిగా , మానసిక వ్యాధిగ్రస్తుడైన చిరుద్యోగికి భార్యగా , అందువల్ల కలిగిన తీవ్రమైన మానసిక వత్తిడివల్ల చిన్న వయసు లోనే కంటిచూపు కోల్పోతుంది. అలాంటి ఒక మహిళ సమాజం పట్లా, వ్యవస్థ పట్లా చూపించిన ప్రేమకీ అతని మనసు చలించి పోతుంది.తల్లి చివరి మాటలనే కర్తవ్యం గా తీసుకున్న సుబ్రతో ప్రస్థానం  మైండ్ ట్రీ సంస్థ వ్యవస్థాపకుడి గా, సంఘ సేవకుడిగా ఎలా సాగిందీ, "గో కిస్ వరల్డ్" లో మనం వివరం గా తెలుసుకోవచ్చు.ఒక్కమాటలో చెప్పాలంటే పుస్తకం సుబ్రతో బాగ్చి ఆత్మ కధ. పుస్తకం ప్రధానం గా మూడు భాగాలు గా ఉంటుంది. సుబ్రతో బాల్యం మొదటి భాగం లోనూఒరిస్సా పరిశ్రమల శాఖలో  ప్రభుత్వొద్యోగి గా మొదలైన సుబ్రతో ప్రస్థానం రెండొ భాగంలోనూ, మైండ్ ట్రీ స్థాపనకు దారి తీసిన పరిస్థితులు మూడో భాగంలోనూ
ఉంటాయి.

దిగువ మధ్య తరగతి కుటుంబంలో , ఐదుగురి అన్నదమ్ములలో చివరి వాడిగా జన్మించిన సుబ్రతో - తండ్రీ, అన్నగార్ల ఉద్యొగరీత్యా వివిధ ప్రదేశాలు తిరగటం , తనకు చాలా మేలు చేసిందని అంటారు.సుబ్రతో తాత గారు వ్యాపార రీత్యా పశ్చిమ బెంగాల్ నుండి బీహార్ వచ్చి స్థిరపడతారు. సుబ్రతో తండ్రి ఉద్యగ రీత్యా ఒడిషా లో స్థిరపడతారు. " నా వంతు వచ్చేటప్పటికి మా నాన్న గారు ఉద్యోగ రీత్యా , ఆయన తదనంతరం పెద్దన్న గారి వద్దకు వెళ్ళడం వల్లనా, ఎనిమిది సంవత్సరాలలోనే ఐదు స్కూల్స్ మారవలిసి వచ్చిందితరవాత నా ఉద్యోగ రీత్యా ముందు భువనేశ్వర్ తరువాత వరసగా ఢిల్లీ , కొల్ కతా, బెంగళూర్, సేన్ ఫ్రేన్సిస్కో., అక్కడి నుంచి మళ్ళా బెంగళూరు   ఇలా ఇరువది ఎనిమిది సంవత్సరాల వృత్తిగత జీవితంలో పదునాలుగు స్థలాలు మారానుఎటువంటి ప్రకృతి పరమైన, సామాజిక, ఆర్ధిక పరిస్థితులకైనా సర్దుకుపోవడానికి ఇంతకన్న అనుభవం ఏమి కావాలి." అంటారు సుబ్రతో బాగ్చి.

చిరుద్యొగి అయిన తండ్రి మానసిక రోగి కూడా కావడంతో, చాలా వరకూ ఆదాయం  అతని వైద్య అవసరాలకు ఖర్చు అవుతూ ఉంటుంది. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోలేని పేదరికంలో ఐదుగురి పిల్లలను చదివించడానికివారికి సమాజం పట్ల సరైనదృక్పధం కలిగించడానికీ తల్లిపడే తపన సుబ్రతో పై చెరగని ముద్ర వేస్తుంది. పరిస్థితులలోనే ఆమె చూపు దెబ్బ తింటుంది."హాస్పిటల్ కి వెళ్ళలేని పేదరికంతో అమ్మ చూపు బాగవడానికి రోజూ ప్రార్ధన చేస్తూ ఉండేది. చివరికి ఇంక చూపు రాదని తెలుసుకున్నాక ఆమె ప్రార్ధనా సమయం ఇంకా ఎక్కువయ్యింది. ఇలాంటికష్టం ప్రపంచం లో మరెవ్వరికీ రాకూడదన్నదే ఆమె ప్రార్ధన వెనుక కోరికఅంటారు సుబ్రతో.ఇది చదువుతుంటే మన మనసు చెమర్చక మానదు.ఇలాంటి పరిస్థితులలో సామాజిక శాస్త్రం లో పట్టభద్రుడయిన సుబ్రతో ఒరిస్సా పరిశ్రమల శాఖ లోఉద్యోగస్తునిగా చేరతారు,ఐతే సమాజం పట్ల అతనికున్న తపన ఆయనని నిలువనీయదు. సమాజానికేమన్నా చేయాలంటే ముందు గా తాను ఎదగాలన్న దృక్పధం , ధైర్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి డి.సి.యంసంస్థ లో ఉద్యొగి గా చేరడానికి దారి తీస్తుంది.

డి.సి.యం. నుంచి హెచ్.సి.యల్. కంపెనీకి, అక్కడి నుంచి విప్రో కు అంచెలంచెలు గా ఎదిగిన సుబ్రతో ప్రస్థానo రెండో భాగంలో మనం చదువవచ్చు. ఉద్యోగి గా విజయవంతమైన సుబ్రతో వ్యాపార రంగం లోకి అడుగుపెట్టి ఎదుర్కొన్నఒడిదుడుకులూ , తీవ్రం గా నష్టపోయి మరలా విప్రో ఉద్యోగి గా చేరడం ఇవన్నీ సోదాహరణం గా వివరిస్తారు రచయిత. సుబ్రతో జీవిత గమనం లో అతని కుటుంబ సభ్యుల పాత్ర వెలకట్టలేనిది. "పెద్ద  అన్నయ్య నుంచి బాధ్యతల పట్ల ఎంత నిబద్ధత ఉండాలో నేర్చుకున్నాను అంటారుసుబ్రతొమధ్య తరగతి కుటుంబాలలో ఉండే ఆత్మీయతలూ.. చిన్నచిన్న త్యాగాలూ.. ఇవన్నీ మన మనసుని కట్టి పడేస్తాయి. మార్పు అనివార్యమైన గ్లోబల్ వాతావరణం లో సంస్థనయినా, వ్యక్తినయినా కొత్త ఆలోచనలొకటే కాపాడగలవు , సృజనే గెలిపించగలదు. సూత్రాన్నిఒంటబట్టిచ్చుకున్న సుబ్రతో " ఎదుగు - ఎదగనివ్వుఅనే సిధ్ధాంతం తో"మైండ్ ట్రీని స్థాపించారు.

పరిణామ క్రమం అంతా మూడో భాగం లో వివరిస్తారు సుబ్రతో బాగ్చి. భారత దేశం లోని ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థల్లో ఒకటైన మైండ్ ట్రీ సంస్థ చేపట్టే సామాజిక కార్యక్రమాలు మనందరికీ తెలుసు. ఉద్యోగులకూ, విద్యార్ధులకూవ్యక్తిగత, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలందించీ సాటిలేని మేటి వ్యక్తులుగా తీర్చిదిద్దటంలో మైండ్ ట్రీ కి వేరే సంస్థ సాటి రాదు. పుస్తకం ముందు మాటలో సుబ్రతో ఇలా అంటారు." మనలో ప్రతీ ఒక్కరి జీవితం వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం గా విలక్షణం గా ఉంటుందినా జీవితంలోని అరోహ,అవరోహణలు మీ అందరి జీవితంలొ ఉండాలని లేదు. ఐతే నాజీవితంలో నేనెదుర్కున్న సంఘటనలు మీకేమాత్రమైనా స్ఫూర్తినీ , ధైర్యాన్నీ,కలిగిస్తే మేరకు నేను విజయవంతమైనట్లే." ఏవ్యక్తి అయినా సమాజానికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇంతకన్నా ఏముంటుంది?

జీవితం లో కలిసిన ప్రతీ వ్యక్తీ తన మీద ఎంతో ప్రభావం చూపించారనీ.. ఫార్చ్యూన్  కంపెనీల సి.. లు తనకి ఎంత స్పూర్తిని ఇచ్చారో, చెన్నై లొ రోడ్ పక్కన కీరా దోస కాయలమ్మే అతని నుంచి కూడ అంతే విలువైన పాఠాలు నేర్చుకున్నాననీ అంటారు సుబ్రతొ
విప్రో లో పని చేస్తున్నప్పుడే తన స్నేహితులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు మొదలు పెడతారు సుబ్రతో . వారంతా కలిసి మొదటగా "సెలెబ్రల్ పాల్సీతో బాధ పడే పిల్ల కోసం పని చేయడం మొదలు పెడతారు. కాలక్రమంలో కర్నాటక లోని "స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియాతో  ఆయనకు ఎనలేని బంధం ఏర్పడుతుంది . మైండ్ ట్రీ  పబ్లిక్ లిస్టింగ్ కి వెళ్ళాక  5000  షేర్లు  స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా కి అలాట్ చేయడం సుబ్రతో గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది

పుస్తకం చదవటం వలన అతి సామాన్య కుటుంబం లో జన్మించిన వ్యక్తి అయినా సానుకూల దృక్పధం కలిగి ఉండి, జీవితం లో ఎదురయ్యే ఆటు పోట్లను కృంగి పొకుండా యథాతధంగా స్వీకరిస్తే, జీవితం లో అత్యున్నత స్థానానికి చేరుకోగలుగుతారని  మనకు  అవగతమవుతుంది.. భారతీయులకు వికాసగ్రంధాలవసరమే లేదని వాదించే వారున్నారు. "మన వేదాలు మనకున్నాయి. మన గీత మనకున్నది. ప్రపంచం లోని   వ్యక్తిత్వ వికాస సాహిత్యం లోనూ లేనన్ని గొప్ప గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాస సాహిత్యమెందుకు చదవాలి" అన్నది ఒక ప్రశ్న.


సాధారణంగా వ్యక్తిత్వ వికాస సాహిత్యం పై ఒక విమర్శ కూడా ఉంది. అందులో చెప్పే ఉదాహరణలు వాస్తవానికి దూరం గా ఉంటాయనీ, ఎవరో అదృష్టవంతులకు జరిగే అరుదయిన సంఘటనలకు అతిశయోక్తులు జోడించి అదే పాజిటివ్ థింకింగ్ అనినూరిపోస్తారనేది విమర్శ.అయితే గో కిస్ వరల్డ్ చదువుతుంటే దాదాపుగా ప్రతీ సంఘటనలోనూ పాఠకులు తమని తాము ఊహించుకుంటారువాస్తవానికి దగ్గరగా, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆటు పోట్లను చాలా సహజం  గా సుబ్రతో బాగ్చి వ్రాయడమేఇందుకు కారణం.నిజమే కుటుంబ విలువలూ, సాంప్రదాయలూ మన మీద చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పురాణ పఠనాలూ, హరికథలూ నీతినీ లోక రీతినీ బోధించేవిమన నడకనీ ,నడతనీ కనిపెట్టుకుని మంచి చెడులు చెప్పడానికి పటాలమంత బంధుగణముండెది. రేపటిగురించి భయపడే పరిస్థితులు లేవు కాబట్టి విజయాల కోసం ఉరుకులు ఉండేవి కావు

"సిరి తా వచ్చిన వచ్చునుఅన్నట్లు సమర్ధుడిని విజయమే వెతుక్కుంటూ వచ్చేది. కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఛ్ఛిన్నమైపోయాక మన జీవితాలకి మనమే బాధ్యులమైపోయాముప్రపంచీకరణ పుణ్యమా అని అభద్రతా భావంకూడా  ప్రవేశించిందిఅదే సమయం లో ప్రాచీన సాహిత్యం లోని మంచిని గ్రహించి అన్వయించుకోగల ఓపికా, తీరికా, పాండిత్యం కొత్త తరాలకు లేకుండా పోయాయి.సరిగ్గా నేపధ్యం లో లోటుని కొంతవరకూ తీర్చే సాహిత్యాలు రావడం ఒక రకం గా మంచి పరిణామం. అలాంటి ఆణి ముత్యాల్లో ఒకటైన "గో కిస్ వరల్డ్" తప్పక చదివి తీరాల్సిన పుస్తకం.

1 comment

Balla Vijaya Kumar said...

సుబ్రత బాగ్చి వ్యక్తిత్వ 'వికాసతత్త్వం' లక్షలకు లక్షలు తీసుకొని AC హలుల్లో తరగతులు నిర్వహించి జీవన గతుల్ని మార్చేస్తున్నామనుకునే నిపుణులతత్వానికి భిన్నంగా వుంది. పనితో తీరుబడిలేకుండా వుండే వారికి ఈ "గోరు ముద్దల" సాహిత్యం అవసరం వుంది . అందరి జీవితాల్లో ఆరోహణ, అవరోహణలు ఒకే రకంగా వుండవు - తన జీవితంలో ఒడిదొడుకులు వ్యక్తులకు ఎంతోకొంత స్పూర్తి నివ్వడమో,అవగాహన కలిగించడమో , సాంత్వన ఇవ్వడమో ఇంకా ఎదో ఒక ప్రయోజనం కలగడమో జరగాలని కోరుకునే సుబ్రత బాగ్చిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ఉమా గారు - వికు