ఇస్మత్ చుగ్తాయ్ కథలు - అనువాదం - పి. సత్యవతి.

 "హృదయం లేని మనిషొకరు ఒక నల్లటి బక్క పిల్లని బెత్తంతో నిర్దాక్షిణ్యంగా బాదుతున్నారు.. అతనెవరో , దెబ్బలు తింటున్న  అభాగ్యురాలెవరో కూడా తెలుసుకొనే వయసు నాకు లేదుకానీ నాకు బాగా ఏడుపొచ్చిందిబాగా ఏడ్చాను లావాటి బెత్తం  పిల్ల వీపు మీదచేసిన శబ్దం నా చెవులలోనే ఉండిపోయి ఇప్పటికీ తరచూ వినపడుతూ ఉంటుంది
      నాకప్పుడర్ధం అయ్యింది.   పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళని ఎప్పుడూ కొడతారుబలవంతులు బలహీనులను హింసిస్తారుబలవంతులు తల ఎత్తుకు నిలబడతారుబలహీనులు వాళ్ళ పాదాల కింద ధూళిలా అయిపోతారు అనిపించిందినేను బలవంతులను అభిమానించి బలహీనులను ఏవగించుకోవడం మొదలు పెట్టానుఅయినప్పటికీ నా లోపల నాకు తెలియని భావాలేవో దాగి ఉన్నాయిఒక గొప్ప భవనపు గోడలకి నాచు పట్టి గడ్డీ గాదమూ మొలచినప్పుడు నేను లోలోపల సంతోషించేదాన్నిచిరునవ్వు వచ్చేది నాకుఅంతటి భవననాన్ని నాశనం చేయగల శక్తి  పిచ్చిమొక్కకి ఉండడాన్ని చూస్తే సంభ్రమం కలిగేది... "
        మాటలు ఇస్మత్ చుగ్తాయ్ తన జీవన యాత్ర లో "ముళ్ళూ పువ్వులూఅంటూ తన గురించి చెప్పుకున్న నాందీ ప్రస్తావనఒక రచయిత్రి నేపధ్యం గురించిచెప్పదలుచుకున్న శిల్పం గురించివ్యక్తీకరించిన శైలి గురించి అర్ధం చేసుకోవడానికి పై మాటలు చాలుస్త్రీలుఅందునాసాహిత్యంలో స్త్రీల ప్రస్థానం అటుంచి అసలు సాహిత్యం అన్న పదాన్ని కలగనటం కూడా పెద్ద నేరంగా పరిగణించబడే 1930-40  నాటి కాలంలో తనకంటూ ఒక ఒరవడి సృష్టించి సాహిత్య రంగంలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న రచయిత్రి కథలు  నెల మీకు పరిచయం చేయబోతున్న " ఇస్మత్చుగ్తాయ్కథలు.  శైలీ విన్యాసంలోనూ శిల్ప పరిణితిలోనూ అగ్ర స్థానానికి ఎదిగితన సహ రచయిత్రులలో కూడా సృజనాత్మకత పెంచి వారిని అభివ్యక్తి వైపు నడిపించిన రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె నిజాయితీధైర్యసాహసాలకు మారుపేరుతాహిరీ నఖ్వీఅంగ్లంలోకి తర్జుమా చేసిన  కథలని ప్రముఖ రచయిత్రి పిసత్యవతి తెలుగులోకి అనువదించారు.


       15 కధల  సంపుటిలో మనం ముందుగా చెప్పుకోవలసిన కథ " లిహాఫ్" .1944 లో రాసిన  కథ సాహిత్యంలో కొత్త ధోరణి ప్రవేశపెట్టిందిఒక తుఫాన్ సృష్టించిందికథలోకి వస్తే   వైవాహిక జీవితంలో తీవ్ర ఆశాభంగానికి గురయిన స్త్రీ బేగం జాన్ఆమె ఒక పరిచారిక దగ్గర లైంగికంగానూ,ఉద్వేగపరంగానూ ఉపశమనం పొందుతుందిఒక స్త్రీ చిన్ననాటి జ్ఞాపకాల రూపంలో ఉంటుందీ కథచిన్నపిల్ల ఊహల్లోంచి వచ్చిన కథ కనుక అమాయకత్వంతో కూడిన ధైర్యమూ నిష్కపటత్వమూ కనిపిస్తుందిబేగంకూ ఆమె పరిచారికకూ ఉన్న సంబంధాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తూనే చిన్నపిల్లచేత చెప్పించడం వల్ల కధలో ఒక సున్నితత్వం మనకు కనిపిస్తుంది కథ ఆరోజుల్లో పెద్ద దుమారాన్ని లేపిందిపాఠకులూవిమర్శకులూ ఆమె కథను తీవ్రంగా విమర్శించారుఅప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అశ్లీలత క్రింద లాహోర్ కోర్టులో కేసు కూడా పెట్టిందిఅయితే ఆకధని కేవలం స్వలింగసంపర్కం గురించి వ్రాసిన కథగా గాక అప్పటి స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థ సాంప్రదాయాలుపితృస్వామ్యం కలసికట్టుగా సృష్టించిన విధ్వంసంవారి జీవితాల్లో పేరుకున్న నిరాశనిస్పృహ  కోణంనించి చూసినప్పుడు మాత్రం మన మనస్సులు చలించక మానవు.
          మరొక కథ " మేలి ముసుగు " .  కథ చెప్తున్న గోరబీ పురుష స్పర్శ ఎరుగని ఎనభై యేళ్ళ కన్యఅత్యంత సౌందర్యవతి అయిన గరిబీ కోటి ఆశలతో కొత్త సంసార జీవితంలోకి అడుగు పెడుతుందిభర్తకు ఎదురయిన ఒక చిన్న ఆత్మ న్యూనతా భావం అర్ధం చేసుకోలేనితనం వల్ల ఆమెజీవితం నరక ప్రాయం అవుతుందిచేయని తప్పుకు ఆమె నిండు జీవితం బలయిపోతుంది.  భార్యగా కోడలిగాతల్లిగా తన భాద్యతలను నిర్వహించడంలో మునిగిపోయిన చుగ్తాయ్ వదిన కథ "శిలమరో కధ.  బంధాలకు విలువ ఇవ్వడంలో మునిగిపోయిన ఆమె కరిగిపోతున్న తన జీవితాన్నిపట్టించుకోదు.
       ఇస్మత్ కథలన్నీ స్త్రీ పాత్రలు ప్రధానంగా వారి చుట్టూనే నడుస్తుంటాయిఅయినా  కథా మరొక కథలా ఉన్నట్లు అనిపించదుఅర్ధ శతాబ్దం క్రిందట ఇంత అవగాహనతో , ఇంత శిల్ప నైపుణ్యంతో రచయిత్రి వ్రాయడం మనకి ఆశ్చర్యమనిపిస్తుందిమనల్ని ఆలోచింపచేసే మరొక కథ "ఒకముద్దనర్సు సరళా బెన్కు బాధ్యతల వల్ల సరైన వయసులో పెళ్ళి జరగదుఅందరికీ తలలో నాలుకలా ఉండే ఆమె ఒక ఇంటిదయితే బాగుండని ఇరుగు పొరుగు వాళ్ళనుకుంటారురోజూ బస్సులో ఆమెతో ప్రయాణించే వ్యక్తి ఆమె పట్ల చూపుతున్న ఆసక్తిని గమనించి , అతనిమెప్పుపొందేటందుకు ఆమెను చక్కగా అలంకరించి పంపుతారుఅయితే ఎప్పుడూ అత్యంత సహజంగాస్వచ్చంగా ఉండే ఆమెను కొత్త వేషంలో అతను గుర్తించలేక ఛీత్కరించుకుంటాడుబాహ్య సౌందర్యంకన్నా అంతఃసౌందర్యం గొప్పదనే భావన కలిగించే  కథ ఆద్యంతం మనల్ని కట్టి పడేస్తుంది.
       అంతే కాదు,  మాట కరుకయినా వెన్న లాంటి మనసున్న బిచ్చు అత్తయ్య,  దేముడిచ్చిన అందమే శాపమై కబళించిన అమృతలత ఇలా చుగ్తాయ్ చెప్పిన ప్రతీ కథా చాలా విలక్షణంగా ఉంటుంది. " ఇది పురుషులకోసం పురుషులు చేసిన ప్రపంచం ప్రపంచంలో స్త్రీ ఒక పాత్ర మాత్రమే.  పురుషుని ప్రేమకో , ద్వేషానికో ఒక అభివ్యక్తి లాంటిది స్త్రీ.  అతని చిత్త వృత్తులను బట్టి ఆమెను ప్రేమించడమోతిరస్కరించడమో జరుగుతుంది". అంటారు ఇస్మత్ చుగ్తాయ్ఆమె కధలన్నీ ఇదే సారాన్ని చాలా పదునుగా వ్యక్తం చేస్తాయి.
        ఇస్మత్ కథలలోని పాత్రలు ఆనాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను చక్కగా ప్రతిబింబిస్తాయిఆమె కధలను అధ్యయనం చేస్తే ఉత్తరప్రదేశ్ లోని ముస్లిం కుటుంబాల సామాజికసాంస్కృతిక జీవితాన్ని బాగా అర్ధం చేసుకోవచ్చువర్గ స్పృహవస్త్ర ధారణవంట పద్ధతులుఆహారం,పుట్టుకవివాహం వంటి సందర్భాలలో పాటించే ఆచార ధర్మాలు అన్నీ వివరం గా చర్చిస్తారామె. "చౌతీ కా జోడాకథలో పెళ్ళి సంబంధాలు కుదుర్చునే పద్ధతి ప్రస్తావిస్తారామెఇప్పటికీ అర్ధ శతాబ్దం తరువాత కూడా ఇండియాలోనూ , పాకిస్తాన్ లోనూ ఇంకా ఇలాగే పెళ్ళిళ్ళు కుదురుతున్నాయిపెళ్ళికూతురు చెల్లిని పెళ్ళికొడుకుతో పరిహాసాలాడడానికి పంపుతారుఅతన్ని ఆకర్షించి పెళ్ళి ప్రతిపాదన రాబట్టడం ప్రధాన యుక్తి ప్రతిపాదన కూడా తాను చూసిన అమ్మాయితో కాదుపెళ్ళివరకూ చూడ నోచుకోని వ్యక్తితో !   కథలో చౌతీ కా జోడా ( పెళ్ళయిన నాలుగో రోజు ధరించేదుస్తులుకున్న ప్రాధాన్యాన్నిఅవి తయారు చేసే పధ్ధతినీ కూడా తెలుసుకోవచ్చు.
       "ముఖద్దర్ ఫర్జ్కథ భారత దేశంలో లౌకిక వాద ధృక్పధం అవసరాన్ని ప్రస్తావిస్తుందిఇప్పటి కాలమాన పరిస్థితులకు కూడా అతికినట్లుండే  కథని చదివినప్పుడు రచయిత్రిలో దార్శనికత మనం అర్ధం చేసుకుంటాంఅలాగే "ఘూంఘట్కథ వివాహ వ్యవస్త పద ఘట్టనల కిందనలిగిపోయిన ఒక స్త్రీ గాధ.  ఇలా ప్రతి కథలోనూ తన శిల్ప చాతుర్యతతో తనెక్కడా తొణకకుండా ప్రేక్షకురాలిగా మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తూ కధని ఎలా అర్ధం చేసుకోవాలన్న విచక్షణ మాత్రం మనకే వదిలేయడం ఇస్మత్ చుగ్తాయ్ ప్రత్యేకతఇస్మత్ కథలలో మరొక ప్రత్యేకత ఏమిటంటేఆమెలో వస్తు పరిమితికేవలం తన చుట్టూ జరిగిన,  తనకి బాగా అవగాహన ఉన్న అంశాలనే ఆమె తన కధలలో వస్తువుగా ఎంచుకుంటారుకేవలం  పరిమితితోనే ఆమె గొప్ప కళాత్మకత సాధించగలిగారుస్త్రీల గురించివారి జీవితాలపై సంస్కృతీ సాంప్రదాయాల ఆంక్షల గురించి,   భారతీయసమాజం లో స్త్రీల స్థాయి గురించిఆమె ఆర్తితో ఆవేదనతో , లోతుగా పరిశీలించారని  కధలు చదివాక మనకు అర్ధమవుతుంది కాలంలో స్త్రీలపై సామాజికంగా జరుగుతున్న అణచివేతదానికి వ్యతిరేకంగా వారి పోరాటంస్త్రీల మనస్తత్వంవారికే స్వంతమయిన అనుభూతులు ఆమె కథావస్తువులు.
     
         ఒక్క మాటలో చెప్పాలంటే " ఇస్మత్ చుగ్తాయ్కథలు అప్పటికీఇప్పటికీ ఒక సామాజిక కదంబ మాల లాంటివి.  సామాజిక ధృక్పధంతోసాంప్రదాయేతర శిల్పంతో సాగే ఆమె కథలు మనల్ని ఆసాంతం కుదిపి మనలో నిద్రాణంగా ఉన్న ఆలోచనలను తట్టి లేపుతాయి పుస్తకం గురిచిమాట్లాడుకునేటప్పుడు పి.సత్యవతి గారి అనువాదా పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువేఉర్దూలో వ్రాయబడ్డ ఇస్మత్ కధలని "తాహీరా నఖ్వీ " ఆంగ్లం లోకి అనువదించారుతరువాత వీటిని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి.సత్యవతి గారు తెలుగులోకి అనువాదం చేసారుఇస్మత్ తెలుగులోనేవ్రాసారా అన్నంత సహజమైన శైలి లో ఉంటాయీ అనువాదాలుఇందులో పాత్రలు ఎంత సహజంగా ఉంటాయంటే పుస్తకం అంతా చదివేసి హాయిగా ఉండడం కుదరదుచుగ్తాయ్ సృష్టించిన "బేగం జాన్కుబ్రాఆమె తల్లీచెల్లీ , రుక్సానాహలీమాగొరబీసరళా బెన్బిచ్చూ అత్తయ్యఇల్లూడ్ఛేముసలమ్మ అంతా చాలా సేపు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు.   కలాలకు , గళాలకు స్వేఛ్ఛ లేని కాలంలోసాంప్రదాయ రీతీ రివాజులు సమాజాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న కాలంలో అత్యంత వాస్తవికంగాగొప్ప దార్శనికతతో వ్రాసిన "ఇస్మత్ చుగ్తాయ్కథలు తప్పక చదివి తీరవలిసినపుస్తకం...

No comments