తేమ పిట్టలు రెక్కలు విదిల్చినప్పుడల్లా మురికి వదుల్చుకున్న ఆకులా స్వచ్చంగా నవ్వుతుంది మనసు మళ్ళీ ఆకుపచ్చగా మెరవడమంటే ఒక గుప్పెడు నవ్వులని గుండెలోకి తాగెయ్యటమే కదూ అవును మరి...గుండెని చేరే ఆకుపచ్చని స్పర్శంటే కంటిని వెలిగించే మెత్తని స్వేచ్ఛ
Post a Comment