వాన చిత్రం

ఒక వర్షాకాలపు సాయంత్రాన
చినుకు చిత్రాలని 
తన రెక్కలపై పరచుకుని,
నాలో ఆనందాన్ని వాల్చుతూ 
వానలో తడిచిన సీతాకొక చిలుక 
ఒకటి ఇలా వచ్చి వాలింది.
విభ్రమంగా దగ్గరకు వెళ్ళి చూసానా...
తన కళ్ళలో ఒక నీటి పాయ...
వాన చిత్రం కాదది 
చినుకుల బరువుకి 
చిధ్రమవుతున్న 
తన రెక్కల గాయపు గానం


No comments