సముద్రం కబుర్లు

"When I am with you, we stay up all night.
When you're not here, I can't go to sleep.
Praise God for those two insomnias!
And the difference between them."
ఈ రోజెందుకో రూమీ ఆవహించాడు నన్ను. నువ్వున్నప్పుడూ.. లేనప్పుడూ కూడా ఒక అలజడి నాలో. మరి ఉండడానికీ లేకపోవడానికీ తేడా ఉందా లేదా..
హ్మ్మ్ 
నేను చెప్పనూ లేను. నీకర్ధమూ కాదు.
Don’t grieve. Anything you lose comes round in another form. అంటాడు రూమీ 
పోగొట్టుకున్నది మరో రూపంలో దొరుకుతుందట. నిజమా... మరి అది జీవితం అయితే అది కూడా ఇంకో రూపంలో దొరుకుతుందా..
ఏమో.. 
రెక్కలు తెగిపడిన సీతాకోక చిలుక, తిరిగి జీవితం ప్రారంభించాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. గొంగళి పురుగులా మళ్ళీ ఒక కుకూన్ లోకి వెళ్ళి... హ్మ్మ్మ్ అంతేనా..
ఇంకో రోజు వస్తుంది. ఇంకో సూర్యోదయం, మరో సూర్యాస్థమయం.
ఈ వెన్నెలా, సముద్రం ఇలాగే ఉంటాయి. సముద్రం ఇవే కబుర్లు చెప్తుంది. ఏదో ఒక ధైర్యం మళ్ళీ మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.
నేనిలాగే ఒడ్డున కూర్చుని దిగంతాలకవతల నాకు తెలియని మిస్టీరియస్ థాట్స్ లోతుల్లోకి వెళ్ళాలని తపన పడుతుంటాను.
ప్రపంచం ఏమీ ఆగిపోదు.
నువ్వూ.. నేనూ కూడా ఉంటాం..
కానీ, మనమే ఉండం. మన కలలూ ఉండవ్.

No comments