చెమ్మ పూల తావి

చీకటి అంచులని తాకుతూ 
తెగిపడుతున్న 
చెమ్మ పూల తావిలోకి 
నువ్వెందుకు వచ్చి పడ్డావో 
నీకెవరైనా చెప్పారా
తవ్వుకుంటున్న వెలుగుపూల మిరుమిట్లలో 
రతనాలుగా మెరవటానికి 
కళ్ళేమీ నునుపైన గులకరాళ్ళు కాదుగా
అపరిమితమైన వెలుగు చేసే మొదటి హత్య 
నీ కంటిచూపునే అన్న నిజాన్ని 
నీకెవరు చెపుతారు
ఓ పిచ్చి చిన్నారీ..


No comments