MIRACLES HAPPENS


ఒక్కోసారి జీవితం ఆగిపోయిందా అనిపిస్తుంది.
కాలమూ... సమయమూ... ఒక్కసారిగా స్తంభించినట్లు 
నడవడానికింక దారే మిగలనట్లు..
ఇక వేయాడానికి అడుగులే రానట్లు..
మనసంతా మౌనంగా... చీకటి కమ్ముకుంటుంది.
మనకు మనమున్నామన్న స్పృహకూడా మాయమైపోతుంది 
అసలు సముద్రం ఎదురుగా ఉందో.. మన మనసులో ఉందో అర్ధం కాదు
కమ్ముకున్న నిశ్శబ్దం అంతకంతకూ చిక్క బడుతుంది 
బహారే ఫిర్‌భీ అయేగీ... అని మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా,
యే దునియా అగర్ మిల్ భీ జాయేయె తో క్యాహై అంటూ గురుదత్.. మన ఆశల్ని చంపేస్తుంటాడు.
హ్మ్మ్మ్... 
ఇంక ఉండడానికీ లేకపోవడానికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది.
మనల్ని మనం కోల్పోయాక... ఇక ముగించేద్దాం అనుకున్నప్పుడు... 
అసలు ముగింపు ఎంత కష్టమో తెలుస్తుంది.
అది అర్ధం అయ్యాక..
అప్పుడు జరుగుతుందో మిరాకిల్.
అద్భుతం ఎక్కడో ఉండదు.. మన మనసులోనే ఉంటుంది.
అప్పుడే అర్ధం అవుతుంది.. ఇప్పటి మన కష్టం ఎంత చిన్నదో..
ఇక,
పలుగూ పారా పట్టుకుని కొత్తదారి వెతుక్కునే ఓపికా వస్తుంది.
ఏమో ఎవరికి తెలుసు 
రేపది అచ్చంగా పూరేకులు రాల్చే
నీడల శబ్దాన్ని మెత్తగా ప్రతిధ్వనిస్తుందేమో.
సరిగ్గా
అప్పుడే వెలిగించుకుంటాం
ఇలా ఒక దీపాన్నీ..
కూసింత ధైర్యాన్నీ...

No comments