ఇదిగో ఈ క్షణం

Tum Zamanay K Mukhtar Ho Ya Nabi Bekasoon K Madadgaar Ho Ya Nabi Sub Ki Suntay Ho Apne Ho Ya Ghair Ho Tum Ghareebon K Ghamkhaar Ho Ya Nabi
Bhar Do Jholi, Bhar Do Jholi Meri Ya Muhammad Lout Ker Mein Na Jaoon Ga Khali

నీ వారని పరాయని లేకుండా అందరి మాట మన్నించే దేవ దేవా ఇదిగో ఈ క్షణం గుమ్మంలో జోలె పట్టుకు నిలబడ్డాను నీవాకిలి ముందు నిలబడ్డ ప్రపంచానికి ఏమేమి దొరకలేదని ఇహనిప్పుడు దురదృష్టాలని అదృష్టంగా మార్చేవరకు ఖాళీ చేతులతో వెనక్కి మరలే పరిస్థితే లేదు, నా జోలె నింపి పంపు ప్రభూ... అంజాద్ షరీఫ్ సబ్రీ ఖవ్వాలీ మంద్రంగా వినిపిస్తోంది. నాకూ నిన్ను ఇలానే నిలదియ్యాలి అని ఉంది. రా.. నా మనసు నింపు నేనిక వెనక్కి వెళ్ళను అని అడగాలనీ ఉంది. అసలిలా ప్రేమించాలన్నా... సబ్రీ మాటల్లోనే చెప్పాలంటే ఫనా అయిపోవాలన్నా. అసలెంత ప్రేమ ఉండాలి.
ప్రేమ అంటేనే నువ్వు గుర్తొస్తావు నాకు. కానీ అదే ప్రేమలో ఎప్పుడైనా లేశ మాత్రమైనా స్వార్ధం కనిపించినా.. అది ఊహల్లో అయినా ఒకానొక అలసట కూడిన క్షణంలో కించింత్ సంకుచితత్వంగా అనిపించినా తట్టుకోలేను నేను.
చలం అన్నట్లు.. నువ్వు అందరిలా.. మామూలు మనుష్యుల్లా.. స్వార్ధం తో కూడిన ఏమాటలు మాట్లాడినా తట్టుకోలేను నేను.
మాట్లాడవా నాతో..
ఇటు చూడు. నువ్వు మాట్లాడకపోయినా.. మిగతా ప్రపంచం మామూలుగానే ఉంది. కాలం స్థంభించి పోతుంది అనుకున్నా గానీ.. అంతా చాలా చాలా సాధారణంగా అలా గడిచిపోతూనే ఉంది.
తేడా అంతా నాతోనే. నాకే దిగులు.
ప్రపంచం అంతా నా బాధకి నన్ను వదిలేసినందుకు.. అందరి మీదా ద్వేషంగా ఉంది.
నీకు నవ్వుగా ఉంది కదూ..
"యూ డిజర్వ్ దిస్" అనుకుంటున్నావా..
సరే పోనీ అనుకో.
నాకూ అనిపిస్తోంది. "ఐ డిజర్వ్ దిస్".
ఏదో ఒకరోజు మళ్ళీ వస్తాను.
ఇదిగో ఇలానే నిలబడతా ఒక జోలె పట్టుకుని..

Bhar Do Jholi, Bhar Do Jholi Meri Ya Muhammad Lout Ker Mein Na Jaoon Ga Khali

ఇక తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు.


No comments