పసి నవ్వు


బయటి నుండి
భద్రంగా తెచ్చుకున్న కలవరాలన్నీ
చుట్టూరా పరుచుకున్నప్పుడు 
గుండె చేస్తున్న గలాటాను వింటూ
మసక బారిన కనుపాపల
తేమ రాతల్లో నుండి
ఎప్పటికీ
అలానే చూడాలనిపిస్తుంది
ఒక పసి పాప నవ్వే నవ్వుని
గాలి పక్షుల రెక్కల కింద
మెత్తగా వత్తిగిల్లుతున్న వర్ణాలన్నీ
తనని వెదుక్కుంటూ వస్తున్న సందడిలో
ఒక చిరు సవ్వడిగా మారిపోయి
ఆ లేత పెదవులపై
మెరుపుగా శబ్దించాలనిపిస్తుంది
ఇప్పుడు,
విశ్వమంత బరువూ
బహుతేలికనిపిస్తుంది
మరి నవ్వు విలువెంతో తెలిసిందిగా

No comments