రేపటి వాస్తవం
యుగాల అణచివేతపై నడిచే ధిక్కారమై
మనసు స్పర్శ చల్లనైన చోట మమకారమై
ఇప్పుడు ఆమె
తనకు తాను మెరుపుగా వెలిగించుకునే దీపం
తరతరాల నిద్రని తట్టిలేపుకుంటున్న
ఆమె కళ్ళు
ధారలుగా కురిసే అశ్రుపాతాలే కాదు
మరి మాలిన్యాన్ని మసి చేసే అగ్నిహోత్రాలు కూడా
ఆమె కళ్ళు
ధారలుగా కురిసే అశ్రుపాతాలే కాదు
మరి మాలిన్యాన్ని మసి చేసే అగ్నిహోత్రాలు కూడా
మృగారణ్యం మేలుకున్నంత సేపూ
ఆమె కంటి పాదుల్లో చేరుకున్న చీకటంతా
శిలాజమై,
ఇప్పుడక్కడ అంకురిస్తున్న వెలుగుకి ఇంధనమవుతుంది
ఆమె కంటి పాదుల్లో చేరుకున్న చీకటంతా
శిలాజమై,
ఇప్పుడక్కడ అంకురిస్తున్న వెలుగుకి ఇంధనమవుతుంది
ఇంతి అంటే వేలమేసికొన్న
ఇంటింటి అంగడి సరుకు కాదంటూ
తనని అనామకంగా ఉంచిన రోజుల
ముడులు విప్పుతున్నంతసేపూ
కొన్ని గుండెలలా కుదేలవుతూ ఉంటాయి
ధైర్యమొకటి ధృఢమవుతూ
సాధుత్వం పలచబడి
జీవిత సాధన పట్టుబడేకొద్దీ
కొన్ని పశుత్వాలలో ప్రాణం కొడిగడుతూ ఉంటుంది
ఇంటింటి అంగడి సరుకు కాదంటూ
తనని అనామకంగా ఉంచిన రోజుల
ముడులు విప్పుతున్నంతసేపూ
కొన్ని గుండెలలా కుదేలవుతూ ఉంటాయి
ధైర్యమొకటి ధృఢమవుతూ
సాధుత్వం పలచబడి
జీవిత సాధన పట్టుబడేకొద్దీ
కొన్ని పశుత్వాలలో ప్రాణం కొడిగడుతూ ఉంటుంది
ఇప్పుడు చూడు
అనంతకాలపు దుఃఖమంతా ఆవిరవుతూ
ఆనందపు నిలకడని ఆస్వాదిస్తూ
వాన ఆగింది ఆమె కళ్ళల్లో
నవ్వు వాలింది ఆమె కాలంలో
అనంతకాలపు దుఃఖమంతా ఆవిరవుతూ
ఆనందపు నిలకడని ఆస్వాదిస్తూ
వాన ఆగింది ఆమె కళ్ళల్లో
నవ్వు వాలింది ఆమె కాలంలో
Post a Comment