చిరు మొలక
ఓ లేలేత మొలక విచ్చుకునే సుందరదృశ్యం కోసం
ఒక చిలక పచ్చని వానని
నీ దోసిలి నుండి విముక్తి చెయ్యమని
నీతో ముఖాముఖిగా కూర్చుందామని అనుకుంటానా
అప్పుడే,
నేలమ్మ ప్రసవ వేదనని
తోడ్కొని వచ్చిన మట్టి పూల పరిమళం
గుసగుసగా చెప్తుంది
ఇది ప్రణామపు సమయమని
అయినా... నా పిచ్చిగానీ
చినుకుల్ని ఎప్పుడు కురవాలో
చిగురాకుల్ని ఎప్పుడు గీయాలో
నేను నీకు చెప్పాలా
చినుకుల్ని ఎప్పుడు కురవాలో
చిగురాకుల్ని ఎప్పుడు గీయాలో
నేను నీకు చెప్పాలా
నిద్రని శాసించే నీకు కాక
నిద్రని శ్వాసించే నాకేం తెలుసు
ఒక దీర్ఘ మెలుకువ కోసం నువ్వేం సిద్ధం చేస్తూ ఉంటావో
ఏ క్షణానికి ఎలాంటి అర్ధాన్ని రాస్తూ ఉంటావో
నిద్రని శ్వాసించే నాకేం తెలుసు
ఒక దీర్ఘ మెలుకువ కోసం నువ్వేం సిద్ధం చేస్తూ ఉంటావో
ఏ క్షణానికి ఎలాంటి అర్ధాన్ని రాస్తూ ఉంటావో
మరి దేనికైనా అర్థం ప్రసాదించడమంటే.....
నీకెంతటి ఆనందమో కదా
నీకెంతటి ఆనందమో కదా
Post a Comment