ఒక నేస్తం
తనని చూస్తే చాలు
వలసపోదామనుకున్న ధైర్యానికీ ధైర్యం వచ్చేస్తుంది
నిరాసక్తతా వృత్తాన్ని దాటి
జీవితాన్ని వెదుక్కునే మొదటి అడుగుకి ప్రేరణ అంకురిస్తుంది
కుమిలిపోతున్న ప్రతి ఒంటరి క్షణమూ ఆత్మహత్యించుకుంటూ
కొత్త ప్రపంచాన్ని సిద్ధం చెయ్యడానికి
కొంగ్రొత్త పుట్టుకై కాలాన్ని లొంగదీసుకుంటుంది

ధనానికి మొలచిన దేహాల నడుమ
అంబరాన్ని శాసించే
ఆత్మస్థైర్యపు నేపథ్యం తను.
అంబరాన్ని శాసించే
ఆత్మస్థైర్యపు నేపథ్యం తను.
Post a Comment