నువ్వు లేని రోజు...
నువ్వు లేని రోజు...
మాట్లాడని రోజు..
ఏంచేస్తాను నేను..
నాకిప్పటికీ ఆశ్చర్యమే…
మాట్లాడని రోజు..
ఏంచేస్తాను నేను..
నాకిప్పటికీ ఆశ్చర్యమే…
బహుశా నీ మౌనంలో నా హృదయాన్ని నింపుకుని
ప్రాణాలుగ్గబట్టుకుని ఉంటాననుకుంటా...
సహనంతో తల కిందకి వొంచి
నక్షత్రాల సవ్వడిని ఆలకించే రాత్రిలా..
శ్వాసల లెక్కలతో నిరీక్షణని కొలిచే సమయంలా..
పారిజాతపు చెక్కిట సిగ్గుని రాస్తున్న శరదృతువులా
రావి ఆకుల వెనుక
నిండారా ధ్వనిస్తున్న నిండు పున్నమిలా...
ఇలా కూర్చుని ఉంటా…
ఇలానే కూర్చుని ఉంటా...
ప్రాణాలుగ్గబట్టుకుని ఉంటాననుకుంటా...
సహనంతో తల కిందకి వొంచి
నక్షత్రాల సవ్వడిని ఆలకించే రాత్రిలా..
శ్వాసల లెక్కలతో నిరీక్షణని కొలిచే సమయంలా..
పారిజాతపు చెక్కిట సిగ్గుని రాస్తున్న శరదృతువులా
రావి ఆకుల వెనుక
నిండారా ధ్వనిస్తున్న నిండు పున్నమిలా...
ఇలా కూర్చుని ఉంటా…
ఇలానే కూర్చుని ఉంటా...
తప్పదు... ప్రతీ రోజులానే తెల్ల వారుతుంది.
చీకటీ మాయమవుతుంది
తలెత్తి చూస్తానా…
కిరణ ఖడ్గాలతో చీకటిని తరుముతూ..
స్వర్ణధారల అభిషేకంతో
ఆకాశాన్ని చీల్చుకుని వచ్చే సూర్యుడిలా...
నీ కంఠం వర్షిస్తుంది ప్రేమగా...
"బంగారూ..."
చీకటీ మాయమవుతుంది
తలెత్తి చూస్తానా…
కిరణ ఖడ్గాలతో చీకటిని తరుముతూ..
స్వర్ణధారల అభిషేకంతో
ఆకాశాన్ని చీల్చుకుని వచ్చే సూర్యుడిలా...
నీ కంఠం వర్షిస్తుంది ప్రేమగా...
"బంగారూ..."
అప్పుడు...
సరిగ్గా అప్పుడు...
నా మాటలు పాటలుగా రెక్కలు చాస్తాయి.
నాలోని అరణ్య నికుంజాలలో...
నీ మాటల రాగాలు పువ్వుల్లా పరిమళిస్తాయి
ఒక ఆనందాన్ని పరిపూర్ణంగా వికసిస్తూ
సరిగ్గా అప్పుడు...
నా మాటలు పాటలుగా రెక్కలు చాస్తాయి.
నాలోని అరణ్య నికుంజాలలో...
నీ మాటల రాగాలు పువ్వుల్లా పరిమళిస్తాయి
ఒక ఆనందాన్ని పరిపూర్ణంగా వికసిస్తూ
Post a Comment