ఊపిరి కొసనే
ఉండుండీ అలికిడి చేసే జ్ఞాపకంలాంటి సెలయేరులా
వెళ్తూ వెళ్తూ ఒక ముద్రని వదిలే జలపాతంలా
ఎండమావి అంశతో ఆచూకీ ఇస్తుంటాడతను
వెళ్తూ వెళ్తూ ఒక ముద్రని వదిలే జలపాతంలా
ఎండమావి అంశతో ఆచూకీ ఇస్తుంటాడతను
తెలిసీ తెలియని కలల్లోనో
అందీ అందని కలవరంలోనో
ఉండీలేనట్లు ఉంటాడతను..
అందీ అందని కలవరంలోనో
ఉండీలేనట్లు ఉంటాడతను..
వర్ణాల్లోనో.. రేఖల్లోనో..
మల్లెల్లోనో.. తుమ్మెదలోనో
ఎక్కడో ఉండే ఉంటాడు తను
మల్లెల్లోనో.. తుమ్మెదలోనో
ఎక్కడో ఉండే ఉంటాడు తను
ఆకృతుల్లోనో.. అక్షరాల్లోనో
మాటల్లోనో.. మౌనంలోనో
ఎక్కడో ఉంటాడతను.
మాటల్లోనో.. మౌనంలోనో
ఎక్కడో ఉంటాడతను.
నేలకి దిగివచ్చి నా లోగిలిలో దీపమైన నక్షత్రంలా
మది ప్రమిద నిండా వెలుగులీనుతున్న దీపహారతిలా
చీకటిపుండుని వెలుగు పండుగా మార్చే వైద్యునిలా
గుండె నిండా స్నేహ వేదాన్ని వల్లెవేసే ఆత్మైక్య నేస్తంలా
జీవితాన్ని ముని వేళ్ళతో స్పర్శిస్తుంటాడతను
మది ప్రమిద నిండా వెలుగులీనుతున్న దీపహారతిలా
చీకటిపుండుని వెలుగు పండుగా మార్చే వైద్యునిలా
గుండె నిండా స్నేహ వేదాన్ని వల్లెవేసే ఆత్మైక్య నేస్తంలా
జీవితాన్ని ముని వేళ్ళతో స్పర్శిస్తుంటాడతను
తనని బంధించి భద్రపరచుకోవడానికి
నా అస్తిత్వమేదని వెదుకులాడుకునేంతగా
తనలోకి నన్ను లీనం చేసుకోవడం తెలిసాకే
అర్థమైంది….తనెక్కడో లేడని
అభౌతికమైన జీవంగా నా చుట్టూ ఆవరించి ఉన్నాడని
తన అస్తిత్వాన్నెప్పుడూ
నా ఊపిరి కొసనే దాచుకుని ఉంటాడని
నా అస్తిత్వమేదని వెదుకులాడుకునేంతగా
తనలోకి నన్ను లీనం చేసుకోవడం తెలిసాకే
అర్థమైంది….తనెక్కడో లేడని
అభౌతికమైన జీవంగా నా చుట్టూ ఆవరించి ఉన్నాడని
తన అస్తిత్వాన్నెప్పుడూ
నా ఊపిరి కొసనే దాచుకుని ఉంటాడని
Post a Comment