కొన్ని దిగుళ్ళకు అంతుండదు...


ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు,
పౌర్ణమి వెన్నెల నన్ను నిద్ర లేపుతుంది..
వెన్నెలతో పోటీ పడుతున్న ఒక చుక్క,
నన్ను చూసి ఫక్కున నవ్వుతుంది..
అక్కడే ఎక్కడో అదే చుక్కని
నువ్వూ చూస్తున్నావని నాకు తెలుస్తునే ఉంటుంది..
నీ గురించి అంతా తెలుసన్న నమ్మకం నాకు
నా చేతలన్నింటిలోనూ నీ అస్పష్ట ప్రతిబింబం
చూస్తారందరూ....
దగ్గరకొచ్చి "ఎవరు తనూ" అని అడుగుతారు..
నిజంగా నాకు తెలీదంటాను
నిన్నొకసారి తడుముకుంటాను..
దూరంగా నవ్వుతూ నువ్వు....
మన జ్ఞాపకాల్ని శాస్వతంగా నిలిచే పదాలుగా 
రాసుకుంటాను
 
నా హృదయంలో ఇమడక నీ రహస్యం వెల్లువలా
ప్రవహిస్తుంది...
మళ్ళీ "ఎవరు తనూ..." ప్రశ్నకి జవాబుగా
నిన్నే తడుముకుంటా...
"నీ పదాల అర్ధం నాకు చెప్పు" అని 
నిల దీస్తావు నువ్వు..
చిరునవ్వుతో నిలబడతాను నేను..
అక్షరాలేంటిలా... అల్లుకు పోతూ..
కన్నీళ్ళా!!!
అంతే! కొన్ని దిగుళ్ళకి అంతుండదు..

-      30.08.15

No comments