కాంతి

ఆకాశం నవ్వినప్పుడల్లా 
అవకాశం చిగురిస్తున్నట్లుంటుంది
కమ్మేసిన ఉదాసీనతలన్నీ
కరిగిపోతున్న చప్పుడవుతుంది
మూసేసిన కనుపాపలు చూస్తున్న కలలన్నీ
వర్ణరంజితపు వాస్తవాలుగా మొలకలెత్తుతున్నాయి
తలని బద్దలు చేస్తున్న వత్తిళ్ళన్నీ
అమ్మ పొత్తిళ్ళ భరోసాలో కొట్టుకుపోతున్నాయ్
ఎంపిక చేయబడ్డ మమతలన్నీ మత్తులోకి జారిపోతూ
మనసుని మూసేసిన తెరలని తొలగించేస్తున్నాయ్
విషాదం రాస్తున్న నిషాదపు గొంతు
ఇక ఎప్పటికీ ఒక చిత్తభ్రమేననిపిస్తుంది
అవును…
అనుకున్నప్పుడల్లా
జీవితం ఇలానే ఉండాలనిపిస్తుంది
ఒక నవ్వుతో లోకానికి కాంతిని అద్దేలా
చీకటిని సైతం వెలిగించుకుంటూ

No comments