గుజరాత్ ఫైల్స్

“Truth is stranger than fiction, but it is because Fiction is obliged to stick to possibilities; Truth isn't.”
--- Mark Twain

నిజమే సత్యం ఎప్పుడూ కల్పన కన్నా చిత్రంగా ఉంటుంది. కొన్ని సత్యాలైతే మరీ.. 

పదిహేనళ్ళుగా ఆరోపణలూ, ప్రత్యారోపణలూ.. కమిటీలూ, కమీషన్లూ... కేసులూ, నివేదికలూ.. ఇన్ని మలుపులు బహుశా ఏ కాల్పనిక నవలలోనూ ఉండవేమో.

కానీ.. ఈ పుస్తకంలో అన్ని విభ్రాంతికర చిత్రాలున్నాయి. స్వయంగా అశ్వాల నోట్లోంచి వచ్చిన నిజాలున్నాయి.
"గుజరాత్ ఫైల్స్".. 


అహింస, శాంతి, పరమత సహనం ప్రభోదించిన జాతిపిత పుట్టిన రాష్ట్రంలో మానవతకే మచ్చగా మిగిలిన అమానవీయ, మతోన్మాద శక్తుల పదఘట్టనల కరాళ నృత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన పదచిత్రం!


ప్రఖ్యాత పరిశోధనా జర్నలిస్ట్ (తెహెల్కా ఉద్యోగి) రానా అయ్యూబ్ రాసిన సంచలనాత్మక పుస్తకం ఇది.


పరిశోధన కోసం "మైధిలీ త్యాగి" గా పేరు మార్చుకుని దాదాపు 8నెలల పాటు ఒక ఇండో అమెరికన్ ఫిల్మ్ మేకర్‌గా రూపాంతరం చెంది అండర్ కవర్ ఆపరేషన్ చేసి బయట పెట్టిన అనేక వాస్తవాలు ఋజువులతో సహా ఈ పుస్తకంలో ఉన్నాయి.


మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో జరిగిన కొన్ని ఎన్‌కౌంటర్‌ల గురించిన అనేక వాస్తవాలతో పాటు.. సర్కారీ దౌర్జన్యాలతో పోలీస్ వ్యవస్థ ఎలా భాగస్వామ్యమయ్యిందీ కళ్ళకు కడుతుందీ పుస్తకం


వైబ్రెంట్ గుజరాత్ వెనుక చీకటి నీడల జాడ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాలి.


నాకైతే ఈ పుస్తకం చదవడం ఒక హింసాత్మక అనుభవం. అంతులేని నిస్త్రాణ ఆవరించి పుస్తకం పూర్తయ్యేసరికి భయభ్రాంతులవుతాం.


అయినా సరే తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.


No comments