నిశ్శబ్దం


ఒక నిశ్శబ్దం కొత్త భాషని చేరవేస్తుంది
మరో నిశ్శబ్దం కొత్త తలపుని చేరువ చేస్తుంది
ఇంకో నిశ్శబ్దం అంతరాలని అంతం చేస్తుంది
అప్పుడనిపిస్తుంది నిశ్శబ్దమెంత మధురం అని

ఒక నిశ్శబ్దం మౌన విస్ఫోటకమవుతుంది
మరో నిశ్శబ్దం మనసుని బీటలు వారుస్తుంది
ఇంకో నిశ్శబ్దం ప్రళయాన్ని పరిచయం చేస్తుంది
మరప్పుడనిపిస్తుంది నిశ్శబ్దం యుద్ధమంత భయానకమని
అందుకేనేమో
కంటి కాటుక ముఖమంతా పరచుకున్నట్లు
నిశ్శబ్దాన్ని ప్రేమించటమే కాదు భరించటమూ
ఒక్కో సారి తప్పనిసరి అవుతుందనుకుంటా
అవును మరి
అన్ని నిశ్శబ్దాలు ఒకేలా ఉండవు
మనసులు చేసే చప్పుడులో
తమ అస్తిత్వాలని తాకట్టు పెట్టుకుని
నిశ్శబ్దంగా మరిగిపోతుంటాయ్

No comments