మహిళలకు మగవాళ్ళతో సమానంగా ఆలయ ప్రవేశం చేసే హక్కు ఉందని కోర్టు ఆదేశం జారీ చేయగానే... కేరళలో ప్రమాదం అందుకే జరిగిందని ఒక పెద్ద మనిషి... ఇంక రేప్‌లు విచ్చలవిడిగా పెరిగిపోతాయని మరో పెద్దాయన వార్నింగ్!!
ఇలా స్టేట్‌మెంట్‌లు ఇచ్చే వాళ్ళపై అసలు క్రిమినల్ కేస్‌లు ఎందుకు పెట్టకూడదు??

నమ్మకాలు సాంప్రదాయాలు ప్రజాజీవితాలను సక్రమంగా నడపలేవు.

సమానతలు, హక్కులు, భాద్యతలు వంటివి వాటిలో ఉండవు. అందుకే ఈ విశ్వాన్ని నడిపించేది దేముడే అని ఎంతైనా నమ్మనీయండి...

జీవితాన్ని నడిపించే అంశాలను మనం రాజ్యాంగం నుంచే పొందాలి. రాజ్యాంగం వాటిని ఇవ్వాలని మనం దశాబ్దాల క్రితం రాసుకున్నాం.

కానీ రాతలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి ఆ సంఘర్షణ నిరంతరం ఉంటుంది. అలాంటిదే మహిళలకు కొన్ని ఆలయాల్లో ప్రవేశాన్ని నిషేదించడాన్ని ప్రశ్నిస్తున్న ఇప్పటి సంఘర్షణ కూడా..


మహిళలు తమ హక్కు కోసం చేస్తున్న పోరాటాన్ని కేవలం ఆలయ ప్రవేశం కోసం కొందరు మహిళలు చేస్తున్న యాగీగా ఎందుకు చూస్తున్నారో అర్ధంకాదు. అసలు ఈ వాదన చేస్తున్న వాళ్ళలో మహిళలే కొంతమంది ఉండడం మరో విషాదం. అసలు ఈ వాదన వెనుకే పెద్ద కుట్ర ఉంది. 


ఏ నమ్మకమైనా, సంప్రదాయమైనా సక్రమ జీవన విధానం కోసం మనిషి ఏర్పాటు చేసుకున్న తొలి పద్ధతులు. అక్కడ నుంచి నాగరికత వైపు చాలా అడుగులు వేసాం మనం..


అసలు సమానత్వాన్ని మించిన నాగరికత ఏముటుంది చెప్పండి!! మహిళలపై సాగే వివక్ష రూపం, సమయ సందర్భాలను బట్టి వేరుగా ఉన్నా అక్కడున్న మూలాలు ఒక్కటే. ప్రకృతి సిద్ధంగా వచ్చిన దేహ నిర్మాణంపై ముందు సందేహాలు, ఆంక్షలు లేవనెత్తితే... దాన్నే ఒక లోపంగా చూపితే... 


... ఆ తర్వాత ఆమె చదువు, ధరించే దుస్తులు, చేసే పనులు.. ఇలా అన్నింటి మీద ఆధిపత్యం చెలాయించ వచ్చు. ఇదీ ఒక పెద్ద కుట్ర.


ఆ రోజుల్లో స్త్రీకి కొంత విశ్రాంతినివ్వడానికి కొన్ని పద్ధతులు పెట్టారనుకుందాం...
మరి ప్రకృతి సిద్ధంగా జరిగే ఆ రుతుక్రమానికి అపవిత్రతను ఆపాదించడం.. అదే కారణంగా ఆమేకు నియంత్రణలు, నిషేధాలు పెట్టడం వీతినేమనాలి.


కేవలం కొన్ని నమ్మకాలను నిలుపుకునేందుకు స్త్రీ అస్తిత్వానికి.. ఉనికికి పెను ముప్పవుతున్న విధానాలను పాటించడం... వీటినేమనాలి???

No comments