నా నువ్వు
నేను రాయలేని పదాలలోకి
నువ్వు ప్రవహించినప్పుడు తెలిసింది
నన్ను మిథ్యను చేసిన నిజానివని
నువ్వు ప్రవహించినప్పుడు తెలిసింది
నన్ను మిథ్యను చేసిన నిజానివని
అసలెక్కడ ఉంటావ్ నువ్వు
అనుకున్నప్పుడల్లా
రాయబడని వాక్యంలా
చదవబడని పుస్తకంలా
నడవబడని వేగంలా
వెంటాడే ధైర్యంలా
అదాటుగా వచ్చేస్తావ్
అనుకున్నప్పుడల్లా
రాయబడని వాక్యంలా
చదవబడని పుస్తకంలా
నడవబడని వేగంలా
వెంటాడే ధైర్యంలా
అదాటుగా వచ్చేస్తావ్
ప్రతీ ధ్వనిలో ప్రతిధ్వనిగా
నువ్వు నన్ను వెదుకుతున్నప్పుడే
నా గుండె ధ్వనిలో నే వినేదంతా
నీ చప్పుడేనన్న సత్యం శబ్దిస్తుంది
నువ్వు నన్ను వెదుకుతున్నప్పుడే
నా గుండె ధ్వనిలో నే వినేదంతా
నీ చప్పుడేనన్న సత్యం శబ్దిస్తుంది
ఎలా మొదలయ్యానో తెలియదు కానీ
నా ముగింపు మాత్రం
నీ ఊపిరి మీదుగా మౌనమవ్వాలి.
నా ముగింపు మాత్రం
నీ ఊపిరి మీదుగా మౌనమవ్వాలి.
Post a Comment