ఉన్నదొక్కటే జీవితం
ఉన్నదొక్కటే జీవితం.
ఇక్కడ ఓడిపోయామంటే వచ్చే మలుపులో మనకోసం ఒక గెలుపు వేచి ఉంటుందని అనుకోవటానికి లేదు.
కానీ ఉన్న ఈ కాస్త జీవితంలో ఎంత మందిని ప్లీజ్ చేయాలని చూస్తామో కదా.
ఎవరికి వారు మనల్ని తమ హక్కుగా అనుకుంటున్నప్పుడల్లా… మన ఆలోచనలన్నీ తమవైన ఆలోచనల అడుగుజాడల్లోనే నడవాలన్న వారి భావనలు మనకు తెలుస్తున్నప్పుడల్లా గుండెకి ఎంతటి రంపపు కోత.
అయినా ఎదిరించి చెప్పం. చెప్తే ఆ బంధం కూలిపోతుందేమో అన్న భయం.
కొన్ని చోట్ల అయితే ఫియర్ ఆఫ్ సోషల్ డిఫీట్.
ఒంటరి అయిపోతామన్న బేలతనం.
కొన్ని చోట్ల అయితే ఫియర్ ఆఫ్ సోషల్ డిఫీట్.
ఒంటరి అయిపోతామన్న బేలతనం.
ఎవరైతే మన ఖాళీతనాన్ని నింపుతారని అనుకుంటామో…
ఎవరైతే మనలో కొత్తగా ఖాళీతనమంటూ పుట్టకుండా చూడాల్సిన స్థానంలో నిలిచి ఉంటారో...
చాలాసార్లు మనకి అయ్యే గాయాలు కూడా వాళ్ళ వల్లే. ఎందుకంటే మనల్ని హక్కుగా ఫీల్ అవుతూ వాళ్ళూ.. వదులుకోలేని ఒకానొక బేలతనంతో మనమూ...
దాదాపుగా ప్రతీ గాయానికి కారణాలు ఇవే

తప్పక కొన్ని సార్లు. తప్పించుకోలేక కొన్ని సార్లు.. మనసు ఉక్రోష పడుతున్నా... నిస్సహాయంగా మరికొన్ని సార్లు... ఇలా
ఎవరో రాస్తున్న క్షణాల్లో మన నడక సాగినంతసేపూ మనసు గదిలోని ఘర్షణల నడత మారదు.
ప్రేమగానో.. హక్కుగానో... ఎక్కడికి పోతామన్న ధీమా తోనో.. ఏదైనాగాని ఎవరో వేస్తున్న బంధనాలు… వాటి కోసం మనం పెట్టే పరుగు మనల్ని మనకి దూరం చేస్తున్న సంగతి అర్ధం కానంత వరకూ మన జీవితం ఇంతే..
ఈ విశాల విశ్వంలో మన ఉనికెందుకో మనం నిరూపించుకోవాలంటేముందు ఉనికికి మనమో విలువని రాసుకోవాలి.
ఆత్మావలోకనాన్ని చేరువ చేసే ఒక నిశ్చలత...
మనల్ని మనకి విప్పి చెప్పే ఒక మౌనం...
ఇవన్నీ కలిపి మనల్ని ఒక నమ్మకం లోకి తీసుకెళ్ళినప్పుడే మనం మనకి దొరుకుతాం,
మనల్ని మనకి విప్పి చెప్పే ఒక మౌనం...
ఇవన్నీ కలిపి మనల్ని ఒక నమ్మకం లోకి తీసుకెళ్ళినప్పుడే మనం మనకి దొరుకుతాం,
మన కోసం సిద్ధం చెయ్యబడ్ద తెల్లకాగితం మన మనసు. దానిపై రాయబడే ప్రతి అక్షరం మనదైనప్పుడే ప్రతి నవ్వులో ఒక స్వచ్చత వికసిస్తుంది.
Post a Comment