మనిషిగా జీవించు... మరణాన్ని జయించు...

“Life is no brief candle to me. It is a sort of splendid torch which I have got a hold of for the moment, and I want to make it burn as brightly as possible before handing it on to future generations.”
George Bernard shaw..

"నేను చనిపోయేనాటికి నా శక్తి పూర్తిగా వినియోగించబడి ఉండాలి. ఎందుకంటే నేను కష్టపడినంత కాలం, నేను జీవించి ఉన్నంత కాలం, జీవితాన్ని దానికోసమే ప్రేమిస్తాను. జీవితం నాకు త్వరగా ఆరిపోయే కొవ్వొత్తి కాదు. నేను ఈ క్షణానికి నా చేతిలో పట్టుకుని, వీలైనంత దీప్తితో దాన్ని వెలిగించి, నా తర్వాతి తరాలకు అందించే అద్భుతమైన దీపకళిక వంటిది.
... జార్జ్ బెర్నాండ్ షా..


ఎంత అద్భుతమైన భావన. ఎంత ఆత్మవిశ్వాసాన్నిచ్చే మాట!!
జీవితం ఎప్పుడూ అంతే.
చివరి క్షణాల వరకు జీవితం అంటే అర్ధం కాదు.
అర్ధం చేసుకున్నాక జీవించడానికి సమయమే మిగిలి ఉండదు.
మనకోసం మనం కాక... సమాజం ఆశించినట్లు మాత్రమే అప్పటిదాకా బతికామని అర్ధం అయ్యాక... చిన్న నిట్టూర్పు తప్ప ఏం మిగులుతుంది ఇంక??
ఒక వాన జల్లులో పిల్లలతో కలిసి నృత్యం చేయడం..
ఒక బుజ్జి బ్రహ్మ కమలం మొక్కని నాటి జాగ్రత్తగా నీళ్ళుపోసి పెంచుకోవడం..
సూర్యోదయాన్ని చూసి... చూసిన ప్రతీసారి ఒక అద్భుతంలా ఫీల్ అవ్వడం...
ఎంత చిన్నవి... అయినా ఎంత గొప్ప ఆనందాలివి!!
ఇప్పుడు.. ఈ నిమషానికి మనం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరి ఉండవచ్చు.
కాని అంతరాత్మని జయించలేకపోతే మనం సాధించిన దానికి విలువేముంది.
నేస్తమా...
జీవితం అంటే అర్ధం తెలుసుకోవడానికి
అందులో మనం పోషించాల్సిన విలువైన పాత్ర గురించి తెలుసుకోవడానికి..
మరణశయ్య వరకూ వేచి ఉండవద్దు.
మరణమంటూ ఒక్క సారి కాలింగ్ బెల్ నొక్కిందనుకో...
ఇక అప్పటికి నువ్వు సాధించిన విలువైన వస్తువులూ...
నువ్వు కొలుచుకుని చేరుకున్న ఆకాశ హర్మ్యాలూ...
అన్నీ..
అన్నీ.. ఇక నథింగ్...
అందుకే ప్రతీ క్షణం మనిషిగా జీవించు.
మరణాన్ని జయించు.


No comments