ఒక వేకువ
ఒక వేకువ ఎంత సుందరంగా మొదలవుతుందో తెలిసాక
నిన్నటి నుండి ఎంతటి ఆహ్లాదాన్ని తీసుకోవచ్చో తెలుస్తుంది
కలువ రేకులకి వన్నెలద్ది వెళుతున్న నెలరాజు..
మబ్బు చాటున దాగుడుమూతలాడుతున్నప్పుడు
ఎవరో వెన్నలని తవ్వుకుంటున్న దృశ్యం
ఒక పువ్వుని కళ్ళతో తాగుతున్న చిత్రం ...
గాలిని అల్లుకుంటూ పరిమళాన్ని వీస్తున్న శబ్దం
నీటిని జల్లుకుంటూ ఆనందంలో తడుస్తున్న కాలం
………………………………….
అవును..
హృదయాన్ని తాకడం వాటికి తెలుసు
వాటికి మాత్రమే తెలుసు
లోలోపలికి ఒక ఆనందానుభూతిని
చేరవేసిన
వెలకట్టలేని క్షణాన్ని తులాభారమేస్తే
ప్రకృతి సోయగాన్ని నిలువెల్లా అద్దుకున్న
గడ్డి పువ్వు చాలు
త్రాసు సమంగా తూగటానికి
అదొక్కటి చాలదూ !
శాశ్వతానంద కారకాలన్నీ మన చుట్టూ
దృశ్యాదృశ్యంగా
తమ కుంచెలని సిద్ధం చేసి ఉంటాయన్న
వాస్తవం మన మదిని చేరడానికి
Post a Comment