నిశ్శబ్దం కమ్మేసిన నిజాన్ని
జీవితాన్నే వ్యాహ్యాళిగా మార్చుకున్నాక ఆనందమొక్కటే అనుభవమవ్వటం పెద్ద వింతేమీ కాదుగా!!.
నిజం!
నడక నాదే అయినపుడు గమనమే ఆనందకారకం అవుతుంది…
ఇక గమ్యం చేరటమన్నది ఒక మైలురాయి మాత్రమే

అయినా.. మనలో మనమాట
జీవితాన్ని మించిన వ్యాహ్యాళి
మనిషికి మరేం ఉందనీ
ఇప్పటికి నేను తెలుసుకున్న నిజమొక్కటే!
గమ్యాన్ని చేరటం లక్ష్యసాధన మాత్రమే కానీ విజయం కానేకాదు
నా వరకూ నాకు విజయమంటే పెదవి మీద చెరగని చిరునవ్వే.
నా నడక కి నా అడుగులే ఊతమైనప్పుడు అవే నా విజయానికి సోపానాలు అవుతాయి. నన్ను నేను నిర్వచించుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు,
నన్ను నేను ఆవిష్కరించుకుంటున్న పయనంలో అకస్మాత్తుగా విజయం నన్ను పలకరించక పోవచ్చేమో గానీ అంతిమం గా అది నా పెదవుల మీద నక్షత్రమై వెలుగుతుంది.
ఎందుకంటే నాలోని అణువణువుకీ ఇది నాదైన నడక అన్న ఆత్మవిశ్వాసం రాజసమై పలకరిస్తుంది కాబట్టి.
నేనిప్పుడు మాట మీటని మౌనాన్ని కాదు
ఒక నిశ్శబ్దం కమ్మేసిన నిజాన్ని
ఒక ఆనందాన్ని అనంతం చేసుకున్న విజయాన్ని

Post a Comment