తొలి ఉపాధ్యాయుడు - చింగీజ్ ఐతమాతోవ్.

తిలక్ కవిత " రోజులు" చదివారా. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు తిలక్ రాసిన "  రోజులు" గుర్తొసాయి. ముఖ్యంగా రష్యన్ పుస్తకాలు.
 రోజుల్ని తలచుకున్నప్పుడలా
ఆనందం లాంటి విచారం కలుగుతుంది ... అంటూ ఇంకా ఇలా గుర్తు చేసుకుంటడు తిలక్..  కవితలో
పచ్చని పచ్చికల మధ్య
విచ్చిన తోటల మధ్య
వెచ్చని స్వప్నాల మధ్య
మచ్చిక పడని పావురాల మధ్య
...
మనం చెప్పుకున్న రహస్యాలు
మనం కలలుగన్న ఆదర్శాలు..

పాత రష్యన్ పుస్తకం ఏది దొరికినా  కవితే గుర్తు వస్తుందిపుస్తకాలతో ఊయలూగిన బాల్యం..  రోజులు మళ్ళీ రమ్మన్నా రావుగోర్కీ సాహిత్యం..మార్క్స్ , ఏంగిల్స్ జీవిత చరిత్రలు..అదే ఊపులో సోవియట్ విప్లవ గాధలూ.. పిల్లల జానపధ కధలూ.. ఒక్కటేమిటి కనిపించిన ప్రతీ సోవియట్పుస్తకాన్నీ ఇష్టంగా చదివేసి సోవియట్ లో జరిగిన విప్లవం ఇక్కడా పునరావృఅతం కావాలన్న కలలూ.. కలలూ.. అదే అప్పటిజీవితం.

         టాల్స్టాయ్ " యుద్ధమూశాంతీగోర్కీ " అమ్మవీటి కోవల్లోకే వస్తాయి చింగీజ్ ఐతమాతోవ్ రచనలుచింగీజ్ ఐతమాతోవ్కిర్గిస్తాన్కు చెందిన రచయితరష్యన్కిర్గిజ్ భాషల్లో రచనలు చేసినా ఆయన రచనలు వంద పైచిలుకు భాషల్లోకి అనువాదం అయ్యాయిఆయన రాసిన పుస్తకాలు"జమీల్య", తల్లి భూదేవి తో పాటు అత్యంత ఆదరణ పొందిన ఇంకో పుస్తకం  నెల మీకు పరిచయం చేయబోతున్న " తోలి ఉపాధ్యాయుడు". 

  మారుమూల కిర్గీజ్ ప్రాంతంలో తొలి పాఠశాలను స్థాపించి... నవ సమాజ నిర్మాణం కోసం ఒక యువ ఉపాధ్యాయుడు పడ్డ తపనను క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్ళను మనసుకి హత్తుకునేటట్లు హృద్యంగా చెప్తారు రచయిత.150 సంవత్సరాల క్రితం ఐత్మాతోవ్ రాసిన రచనలుఇప్పటికీవన్నె తగ్గకుండా సమకాలీన రచనల్లా అలరించడానికి కారణం ఆయన స్పృశించిన సార్వజనీనమానవీయ భావనలే కారణంఅంతే కాక ఆయన జీవితాన్నీ.. సామాజిక పునాదునలు కుదిపేసిన అప్పటి కాలాన్ని కూడా మనం తరచి తరచి గుర్తు వేసుకోవాలిఅందుకే ఒక అనామక ప్రాంతంలోఅత్యంత అనామకంగా పుట్టి పెరిగి కేవలం తన రచనల ద్వారానే విశ్వవ్యాప్త ఖ్యాతిపొందుతూ కిర్గిస్తాన్ జాతిపితగా ప్రజల గుండెల్లో చిరస్థాయి పొందారాయన.

          ఇక కధలోకి వెళ్తేకధ ఒక చిత్రకారుడి కధనం తో మొదలవుతుందికిర్గీజ్ దేశంలో కుర్కురేవు కొండ దిగువన ఉన్న విశాల పీఠభూమి కింద అతని ఊరు ఉంటుందిజలజల ప్రవహించే సెలయేళ్ళు , పల్లె లోతట్టున విస్తరించి ఉన్న పసిమి లోయసైప్ మాదానం గురించి చెప్పాలంటే మనమాటలు చాలవురచయిత వర్ణన చదవాల్సిందేపల్లెకు ఆనుకుని ఉన్న దిబ్బ మీద రెండు పోప్లార్ వృక్షాలు ఉంటాయి దిబ్బ పేరు "డ్యూషన్ బడిదిబ్బపేరు వినడమే తప్ప  డ్యూషన్ ఎవరో  పిల్లలకు తెలియదుఅసలు అలాంటి బడి ఒకటి ఉండేదని కూడా ఎవరూ నమ్మరు.
         అలాంటి రోజుల్లో ఒకనాటి శరత్కాలంలో గ్రామ సమిష్టి క్షేత్రం స్వంతంగా ఒక అధునాతన పాఠశాల నిర్మించుకుంటూ..  ప్రారంభోత్సవానికి రమ్మని చిత్రకారుడికి కూడా ఆహ్వానం వస్తుందిఆహ్వానితులలో కిర్గీజ్ దేశపు అత్యుత్తమ విద్యావేత్తలలో ఒకరైన అల్తినాయ్ కూడ ఉన్నట్లు అతనికితెలుస్తుందిఅల్తినాయ్ కూడా  ప్రాంతానికి చెందిన మహిళేప్రారంభోత్సవం నాడు అల్తినాయ్ కి గ్రామస్థులు సన్మానం చేస్తారుసన్మాన కార్యక్రమ జరుగుతుండగా.. డ్యూషన్ అనే ఒక ముసలి వయస్కుడు  ఊరి పొస్ట్ మేన్ గా పనిచేస్తున్నాడని అల్తినాయ్కి తెలుస్తుందిబడి ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన టెలిగ్రాంలు అందచేయడానికి ఏంతో శ్రమ పడి సమయం మించిపోకుండా వచ్చాడనీ.. చదువంటే అతనికి ఎంతో అభిమానం అనీ అందరూ అనుకుంటుంటే అతనే తమ తొలి ఉపాధ్యాయుడని గుర్తిస్తుందామెఅయితే ఎవరికీ  విషయం చెప్పకుండా అర్ధాంతరంగాఅక్కడ నుంచి వెళిపోతుందివెళిపోయాక పస్చాత్తాపంతో తన గత చరిత్ర చెప్తూ మన చిత్రకారుడికి ఒక లేఖ వ్రాయడంతో అసలు కధ మొదలవుతుంది.
     1924 సంవత్సరంలో జరిగిన కధ అదిమారుమూల ఉన్న కిర్గీజ్ దేశపు ఒకానొక పల్లెటూరిలో అసలు చదువుబడి అంటే విడ్డూరంగా ఉండే రోజులవిఇంకా పురాతన పితృస్వామిక పద్ధతులు రాజ్యమేలుతున్న రోజులవికుటుంబానికి ఒకరు చెప్పున తప్పని సరిగా యుద్ధానికి యువకులంతావెళ్ళాల్సిన రోజుల్లో ఆధునికతకూసాంప్రదాయాలకూ మధ్య తలెత్తే వైరుధ్యాలూ.. వత్తిళ్ళూ అన్నీ ఇన్నీ కావుఅల్తినాయ్ కుటుంబం కూడా అందుకు అతీతం కాదుఅలాంటి ఆనంద రహిత జీవితాల్లోకి ఒక రోజు డ్యూషన్ దిగివస్తాడు.
                 పిన్నలనీ పెద్దలనీ.. బ్రతిమిలాడి భయపెట్టీ చదువు నేర్పిస్తాడు.  మొదటి రోజు బడికి వచ్చిన పిల్లలకు లెనిన్ చిత్తరువు చూపించడం.. లెనిన్ గొప్పదనం తెలియచెప్పడం.. ఓనమాలతో పాటు పిల్లలకు విప్లవం అన్న పదాన్ని ముందుగా నేర్పడం  క్రమం అంతా మాటల్లో చెప్పలేంచదివి తీరాల్సిందేచదువులో చురుగ్గా ఉన్న అల్తినాయ్ ని పై చదువుల కోసం పట్టణం పంపాలని కలలు కంటాడతనుఅయితే అల్తినాయ్ మారుటి తల్లి ఆమెకి ఒక దుష్టుడితో బలవంతంగా పెళ్ళి చేయడానికి నిర్ణయిస్తుందిపెళ్ళికి వప్పుకోని అల్తినాయ్ ని బలవంతంగా చెరుస్తాడు  దుర్మార్గుడు.ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమెని రక్షించిన డ్యూషన్ ఆమెపై జరిగిన దౌర్జన్యం కేవల శారీరకమైన గాయం అనీ.. అన్నీ మర్చిపోయి ధైర్యంగా చదువుకోమనీ.. చెప్పి రహస్యంగా రైలు ఎక్కించి ఆమెను  పట్టణం పంపిస్తాడు.
       క్షణంలో అంతటి దుఃఖంలో అల్తినాయ్ మనసులో అవిష్కృతమయిన అందమైన భవిష్యత్తూ..  స్వేచ్ఛా ప్రియురాలి మనస్సులో నెలకొన్న ఆత్మాభిమానమూ..  యవ్వన హృదయంలో తొలివలపు భావాలూ.. ఇవన్నీ రచయిత చెప్పే పద్ధతి అపురూపంఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండాతాను పెద్దగా చదువుకోక పోయినా కేవలం లెనిన్ స్ఫూర్తితో తన తరువాతి తరం అయినా మచి చదువులు చదవాలన్న డ్యూషన్ పాత్ర చిత్రీకరణ ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంఇంతా సాధించీ చివరకు ఎవరూ గుర్తు పట్టని అనామకుడిగా అత్యంత సాధారణంగా ఒక పోస్ట్మేన్ గామిగిలిపోయిన డ్యూషన్... తాను చదివించీ ప్రయోజకురాలిని చేసిన అల్తినాయ్ ముఖ్య అతిధిగా వచ్చిన స్కూల్ కి అభినందనల టెలిగ్రాం లు ఇచ్చి నిర్వికారంగా వెళ్ళిపోవడం మన మనసుల్ని మెలిపెడుతుంది.
           "లెనిన్ ని గౌరవించినట్లుగా మనం సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నాంఅంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అల్తినాయ్ వ్రాసిన ఉత్తరాన్ని మనమూ కన్నీళ్ళతోనే చదువుతాండ్యూషన్ గురించి తమ గ్రామానికే కాక దేశానికి తెలియవలసింది చాలా ఉందనీ..తమ తొలి ఉపాధ్యాయుడు డ్యూషన్ కు గౌరవంగా తమ స్కూల్ పేరు డ్యూషన్ స్కూల్ గా నామకరణం చేయమనీ అల్తినాయ్ కోరడంతో కధ ముగుస్తుందిఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ తమ సమాజాలకి ఎంతో మేలు చేసిన అజ్ఞాత మహానుభావులు ఎందరో  పుస్తకం చదివాక మనకిగుర్తుకు రాక మానరు.

తాను రాసిన లేఖ చివర్లో అల్తినాయ్ ఇలా అంటుంది

కొండల్లో నీటి బుగ్గలు ఉంటుంటాయికొత్త రోడ్డు వేసినప్పుడునీటి బుగ్గకు వెళ్తూండిన బాట మరుగున పడిపోతుందిబాటసార్లు దాహం తీర్చుకోవడానికి వెళ్ళడమూ తగ్గిపోతుందిఅందరూ దాని గురించే మర్చిపోతారుఎప్పుడో ఒక సారిఎవరో ఒక బాటసారి అక్కడకు వెళ్తాడుఅవంతైనా బురద లేకుండా.. స్వచ్ఛంగా ఉన్న  నీటి బుగ్గని చూసి ఆశ్చర్యపోతాడుఇలాంటి ఒక స్థలం ఉందనీ.. దాని గురించి ప్రపంచానికి తెలియ పోవడం పాపం అనీ అనుకుంటాడునా తొలి ఉపాధ్యాయుడి గురించి ప్రపంచానికి తెలియక పోవడమూఅంతే"

   ఐతమాతోవ్ రచనా కౌసలాన్ని చెప్పడానికి పై పదాలు చాలు."రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించడం కన్నా తన సమాజం అంతరాత్మగా ప్రతిధ్వనించడమే ముఖ్యంఅన్న గోర్కీ మాటలను ఆయన శిరసావహించారుఒక రచయిత నిబద్ధతకు ఎటువంటి భేషజాలూ లేకుండా మార్పునుఆహ్వానించడంఆవిష్కరించడమే నిజమైన కొలమానమని వ్యాఖ్యానించేవారాయనఅందుకే ఆయన సొవియట్ వాస్తవికతలోని చీకటి కోణాలనూ నిష్కర్షగా తన రచనల్లో ఆలోచనాత్మకంగా ప్రతిబింబించారుయుద్ధం సామాన్యుల జీవితాల్లో రేపే సంఘర్షణ ఆయన రచనల్లో అత్యంత సహజంగాచిత్రీకరించ బడుతుంది.
                         అందుకే కిర్గీజ్ జాతిపితగా పేరు పొందిన ఆయన రచనలను  దేశంలో ప్రతీ కుటుంబం మళ్ళీ మళ్ళీ చదువుతుందితన రచనల ద్వారా  దేశానికి గుండె ధైర్యం నూరిపోసారాయనకళాత్మకమైన దార్శనికతతో ఎంత సాధించవచ్చో , దాని శక్తి సామర్ధ్యాలేమిటో ప్రపంచానికినిరూపించిన రచయిత ఐతమాతోవ్అందుకే ఆయన రచనలు అందరం చదివితీరాలి.

No comments