ఇన్‌క్రెడిబుల్ గాడెస్ – డా. కేశవ రెడ్డి.


కప్పల్ని పాములు మింగేస్తాయి..
కబోది పిట్టల్ని బావురు పిల్లులూ..
రామ చిలకల్ని గుడ్లగూబలూ..
అలాగే పులులూ సింహాలూ చిన్న జంతువుల్నీ..
ఇది సృష్టిలో మామూలే
డార్విన్  ప్రతిపాదన ప్రకారం అయితే "సర్వైవల్ ఆఫ్  ఫిట్టెస్ట్"  !!.
ఇదంతా బాగానే ఉందికానీ అవేవీ తమ స్వజాతి మీద దాడి చేయవుఅవి ఎంత బలహీనమయినవి అయి ఉండు గాక !  దురన్యాయం ఒక్క మానవ జాతి లోనే కనిపిస్తుంది.  మనుష్యులే తోటి మనుష్యుల్ని హింసించిపీడించిరాచి రంపాన పెట్టి రాబందుల్లా పీక్కు తినే  దురన్యాయం ఇలాఎంత కాలమైనా కొనసాగవలసిందేనా ?
అని ఆవేదనగా ప్రశ్నిస్తారు డాకేశవ రెడ్డి
    సమాధుల మధ్య జయస్థంబాలు లేచే  వ్యవస్థేనా మహత్ముడు ఆశించిన స్వరాజ్యం ? అని నివ్వెరపోతాడాయనఎలాంటి దాపరికం లేకుండామొహమాటపడకుండాదళితుల జీవన సమస్యకి కీలకమైన లోపం ఎక్కడుందో చెప్పే ప్రయత్నం డాకేశవ రెడ్డి వ్రాసిన "ఇన్క్రెడిబుల్ గాడెస్ " పుస్తకంమధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన కేశవరెడ్డి తన చుట్టూరా సమాజం లోని నిమ్నోన్నతాల్నిహింసనీదళితుల అంతులేని దుఃఖాన్ని మనసు తెరచి చూసిన మానవుడుఒక మహోన్నత ఆశయం కోసం కలం పట్టిన రచయిత. "ఇన్క్రెడిబుల్ గాడెస్ఆయన వ్రాసిన మొట్టమొదటిపుస్తకం.

       నవలలో కథానాయకుడి పేరు రామచంద్రుడుఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న దళిత యువకుడుఊరిపెద్ద అయిన పెద్దిరెడ్డి ఒక దొంగ సాక్ష్యం చెప్పమంటే చెప్పటానికి ఒప్పుకోడుఫలితంగా రామచంద్రుడి ఇల్లు లాక్కుంటాడు పెద్దిరెడ్డిఎదురు తిరిగిన అతనిని పెద్దిరెడ్డి దగ్గర కూలీలుగా పనిచేస్తున్న తోటి దళితులే కొడతారుఇక ఏం చేయలేక భార్యనీ కొడుకునీ పెంపుడు పందుల్నీ తీసుకుని " రాముడుండాడు రాజ్జిముండాదిఅన్న నమ్మకంతో ఊరు వదులుతాడు
        ఎన్నో మైళ్ళు నడిచి నడిచి ఒంటిల్లు అనే కొత్త ఊరు చేరి అక్కడ పొలిమేరలో ఉన్న సత్రంలో దిగుతాడు.   ఊరులో కూడా పెదరెడ్డి లాగానే ఒక మునసబు ఉంటాడుకొబ్బరి చెట్టు కూల్చే దినకూలికి చేరతాడుపని పూర్తి అయ్యక తిరిగి వెళుతూ తన కొడుక్కి వడ దెబ్బ తగిలిందనీ ఒక్కకొబ్బరి బోండాం ఇమ్మనీ బతిమాలుకుంటాడుమునసబు ఇవ్వక పోగా పక్కన ఉన్న మిగిలిన కూలీలు కూడా అతనిని గేలి చేస్తారుతరువాత  అక్కడ ఎదురైన పరిస్థితుల్లో మళ్ళీ సాటి కులస్థుల వల్లనే అతని పందులు మొత్తం చచ్చిపోతాయిఅంతకన్నా దారుణంగా అతని కొడుకు కూడాచచ్చిపోతాడుతనకు మిగిలిన  సగం జీవితాన్ని కూడా  ఊళ్ళో పొగొట్టుకున్న రామచంద్రుడు మళ్ళీ రోడ్డున పడతాడు.
          ఒక ఊరు చేరతాడు. అక్కడ కూడా అతనికి నిలువనీడ దొరకదు ఊర్లో అర్జునరెడ్డి అనే వ్యక్తి అతనికి తన గుడిపక్కన ఉండే తన నివాసం లో చోటు కల్పిస్తాడురోజు పొద్దున్నే దేముడిని ఊరేగించేటపుడు అర్జునరెడ్డి ఇల్లు కూడా చుట్టి ఊరేగింపు జరుగుతుందితర్వాత దళిత వాడలో కలరావ్యాపిస్తుందిదళితుడు ఉన్న ఇంటి చుట్టూ దేముడి తిరగవలసి వచ్చింది కాబట్టి దేముడే ఆగ్రహం చూపించాడని మొత్తం దళిత వాడంతా రామచంద్రుని మీద దాడికి వస్తారుఅర్జున రెడ్డి అతన్ని కాపాడి ఇంటిలోపల దాచేస్తాడుఆగ్రహంతో  ఇంటికి నిప్పు పెడతారుఅర్జునుడి మంటల్లోగాయపడతాడు..  అప్పటిదాకా తన కులం వల్ల తనకు ఎదురయిన  అవమానాల్ని ఇబ్బందుల్నీ ఎంతో నిబ్బరంగా ఎదుర్కొన్న రామచంద్రుడు తనను కాపాడిన అర్జునరెడ్డి తనవల్ల మంటల్లో కాలిపోతున్నప్పుడు తట్టుకోలేకపోతాడుఅతనిని కాపాడడానికి కట్టుబాటు(దేవాలయ ప్రవేశం నిషిద్ధం)అతిక్రమించాల్సి వచ్చినప్పుడు నిస్సహాయం గా వణికిపోతాడు.
                          నవల మనలో మనలో మన మనసుల్లో రేపే సంచలనం అంతా ఇంతా కాదుదాస్య స్వభావం అనేది దళితుల్లో నరనరానా ఇంకిపోయి ఎలా వారిని మరో జీవితం గురించి ఊహించలేనట్లుగా చేస్తుందో  నవల చూపిస్తుంది నవలలో వాస్తవానికి పెద్దిరెడ్డిఇంటిల్లుమునసబు అగ్ర కుల దురహంకారంతో ఉంటారుఅయితే వారి వద్ద పని చేస్తున్న దళితులు కూడా తర తరాలుగా బానిసత్వం నర నరాల వంటబట్టించుకొని  స్వాతంత్ర్యం అన్నది ఆలోచించడానికే ఇష్ట పడకపోవడం మనల్ని ఆశ్చర్యానికి  గురిచేస్తుంది.

      రామచంద్రుడు బానిసత్వం నుంచి విముక్తి కోసం జరిపే పోరాటం మన మనసుని కదిలిస్తుందికధలో తొంగి చూసే ప్రతీ పాత్రవేపూ మనంకూడా ఆశ గా తొంగి చూస్తాంరామచంద్రుడికి ఎవరైనా తోడయితే బాగుండుఅని మనసు కొట్టుకు పోతుందిసోదర మానవుల చేత అదఃపాతాళంలోకిత్రొక్కబడిన జాతులు ప్రపంచంలో చాలా ఉన్నాయిఒకప్పుడు నీగ్రోలతో తెల్లవారు పశువులతో వ్యవహరించినట్టు వ్యహరించేవారు తరువాత వారు హక్కుల కోసం విప్లవాలురేపి , ఎడతెగని యుద్ధాలు చేసి జయించి స్వేచ్చా వాయువులు పీలుస్తుండడం మనం చూస్తున్నాం.

        అయితే శతాబ్దాలు గడుస్తున్నా దళితుల్లో అలాంటి చైతన్యం ఎందుకు రావట్లేదన్నది కేశవ రెడ్డి ప్రశ్నచివరి దాకా ఎంతో ధైర్యం గా పరిస్థితులు ఎదుర్కొంటాడు రామచంద్రుడుఎంతగా ఒంటరి పోరాటం చేసినా అలసిపోడుచివరకు తనను కాపాడినందుకు అర్జున రెడ్డి మంటల్లోకాలిపోతున్నప్పుడు  ధైర్యం కోల్పోతాడు.  అర్జునరెడ్డి తనను కాపాడటానికి , కాలిన శరీరం నుండి ఉపశమనం పొందడానికి గుడిలోకి వెళ్ళి ఆముదం తెమ్మన్నప్పుడు "గర్భగుడిలోకి నేనెట్టపోదును సామిఅంటాడు నిస్సహాయంగాఅన్ని పరిస్థితుల్లోనూ ఒంటరిగా పోరాడిన రామచంద్రుడు చివరకుక్షుద్ర కుల వ్యవస్థ చేసిన కరాళ నృత్యం ముందు ఓడిపోయి తలదించుకున్నప్పుడు మనం ఉక్రోషపడిపోతాంకోపమో , దుఃఖమో తెలియని  వింత బాధ మనసుని కమ్మేస్తుందిదాస్య స్వభావం అనేది వాళ్ళ నరనరాల్లో ఎలా ఇంకిపోయిందోచీకట్లో మగ్గిపోతున్న వాళ్ళ జీవితాల్లోకి చిన్న వెలుగు రేఖరావడం కూడా ఎంత కష్టమో అర్ధం చేసుకున్నప్పుడు మనం కూడా  పాత్రలతో కలిసి యేడుస్తాం
     అసమ భారతీయ కుల వ్యవస్థనుహెచ్చు తగ్గుల నిచ్చెన మెట్ల లాంటి రాజకీయార్ధిక వ్యస్థను ఇన్క్రెడిబుల్ గాడెస్(క్షుద్ర దేవతగా అభివర్ణిస్తారు రచయిత డాకేశవ రెడ్డిమనిషిలోని బానిసత్వాన్నితిరుగుబాటు తత్వాన్ని అత్యంత మానవీయ కోణం నుండి దర్శించిఅంత మానవీయం గాఅభివ్యక్తం చేసిన పుస్తకం ఇన్క్రెడిబుల్ గాడెస్రచయిత 1979 లో రాసిన నవల ఇదిబలవంతుడి కొమ్ము కాస్తూ తన బలం ప్రదర్శించే బలహీనుల వికృత హింసా తత్వాన్నివారు పొందే పాశవిక ఆనందం వెనుక వేళ్ళూనుకుపోయిన రుగ్మతని కళ్ళకు కట్టి చూపిస్తుందీ  నవల.   

                నవల చదువుతున్నంత సేపు కేశవరెడ్డి మన చేయి పట్టుకుని రామచంద్రుడి వెనుక మనల్నీ నడిపిస్తారుమనం కూడా రామచంద్రుడితో పాటు పెదిరెడ్డి మనుషులుమునసబు మనుషుల చేతుల్లో చావు దెబ్బలు తింటాంఅర్జున రెడ్డి గా మారి రామచంద్రుడిని అక్కునచేర్చుకుంటాంఅర్జున రెడ్డి మంటల్లో కాలిపోతున్నప్పుడు మనం కూడా యేడుస్తాంఖచ్చితంగా నవల ముగిసేసరికి మనశ్శుద్ధి జరిగి కొత్త జన్మ ఎత్తుతాం.

No comments