#SayNo

What is GST??
A. Goods and Services Tax
B. God Sex and Truth
C. Either A or B
D. Both of the Above
ఎప్పుడో ఒకప్పుడు మీ పిల్లలు ఈ క్విజ్ మీకు పెట్టొచ్చు. 
Hmmm.. 
మీ బ్రహ్మాండం బ్రద్దలైపోతుంది. పాపం పిల్లలు. వాళ్ళకేం దురుద్దేశం లేదు. వాళ్ళని కొట్టకండి. మీరే చాటుకు వెళ్లి మీ చెప్పుతో మీరే కొట్టుకోండి .
సారీ!
ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. InDia కి అన్నీ వచ్చేసాయి. అన్నీ… ఎక్కడో ఒక చోట Upload అయ్యి, ఇక్కడ download అయిపోతాయి. మనమేం తక్కువ.. మనకేం తక్కువ… Meraa Bharat Mahaan!
వర్మ గారిష్టం… అతను తీస్తాడు. ఇష్టమైతే చూడండి. లేకపోతే లేదు. మనది స్వత్రంత్ర భారతం. తరం.. స్వరం మారుతోంది.
మరి మన పిల్లలకేం చెప్పాలి.. GSTని చూసి, తప్పనిపిస్తే మానేయమని చెప్తామా?
మీఖర్మ. స్వత్రంత్ర భారత పౌరుడిగా తీయడం వర్మ గారి హక్కు.
ఇక మిగిలినదంతా మీ కష్టం.
ఇంతకీ ఏంటది? . సాధికారత కదూ. What is this సాధికారత!! దేహం మీదేనా సాధికరత ఉండాల్సింది.
దేహం… Jism… ఇంతకీ దేహం అంటే వట్టి దేహమేనా? ఏమన్నా Configuration ఉందా? ఓహ్ ! అదీ అతను చెప్తాడా? సారీ చూపిస్తాడా? ఓకే…
అయినా మనది మామూలు నిద్ర కాదు. మొద్దాతి మొద్దు నిద్ర. ఎవడేమి చేస్తే మనకేంటి? మనం మాత్రం మన విజ్ఞతని అసలు waste చేయొద్దు. వీలైతే మన డ్రాయింగ్ రూం లో కూర్చుని అతని వికారపు ఆర్గ్యుమెంట్స్ విని కాసేపు నవ్వుకుందాం.. “ అసలేంటీ ఇతనూ…” అని ఎవరో మన లాంటి ఒక ఫ్రెండ్ తోనే కాసేపు వాదించుకుందాం.
అవతలి పక్క గదిలో మన పిల్లలు మియా మాల్కోవా సొగసుల అంచుల్లో కాసేపు కొట్టుకు పోతారు. తప్పో ఒప్పో వాళ్ళు నిర్ణయించుకుంటార్లే . వర్మ గారు చెప్పారుగా !
Hey !! దిస్ ఈజ్ నథింగ్ బట్ సామాజిక స్పృహ. దేహంపై సాధికారత. అతనలా చెప్తూ ఉంటాడు. మనం వింటూ ఉందాం!
అతనలా తీసినందుకూ, టీవీ లో చర్చా కార్యక్రమాలు TRPల కోసమా సామాజిక బాధ్యతల కోసమా అన్నది తరవాతి సంగతి… వర్మ గారి GSTకి ఊహించనంత పబ్లిసిటీ ఇచ్చినందుకు ఆయన మాత్రం మీడియాకి ఋణ పడిపోయాడు.…
పాప పుణ్యాలు పక్కన పెడితే… 
ఇప్పుడిప్పుడే రెక్కవిప్పుకుంటున్న బాల్య, కౌమార, యవ్వన సంధికాలపు పిల్లలకు తాను చేసిన / చేయబోతున్న ద్రోహం మాత్రం ఈ దేశపు సరళీకృత ఆర్ధిక విధానాల కన్నా మించినది.
ఇదొక స్పీడ్ యుగం. క్రొత్తదాన్ని చూస్తే దాని అంతు తేల్చే పిడుగుల్లాంటి పిల్లలున్న యుగం. చిన్న పిల్లలు వేసే పంచ్ డైలాగ్స్ చూసి ముచ్చట పడుతున్నాం కదా… ఇక ముందు GST అంటే ఇంకొంచం తమ అర్థం చెబుతారు. గుండె దిటవు చేసుకోండి.
నందామయా గురుడ నందామయా...
ఉందామయా తెలుసు కుందామయా..
మీకు తెలుసా.. ఒక కప్పని వేడి వేడి నీళ్ళలో వేసామనుకోండి. అది ఎగిరి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకుంటుంది. 
అదే కప్పని చన్నీళ్ళలో వేసి, కింద పొయ్యి వెలిగించామనుకోండి. ఆ నీళ్ళు నెమ్మదిగా వేడెక్కుతుంటాయి. కప్ప కూడా ఆ వేడికి నెమ్మదిగా అలవాటు పడిపోతుంది. 
చివరికి ఉడికి చచ్చిపోయినా దానిలో రెసిస్టెన్స్ ఉండదు. 
పోర్న్ కూడా అంతే 
X - రేటెడ్ వర్షం కుండపోతగా కురియబోతుంది. 
మీ చర్మం మొద్దు బారిందా… లేదా… కొంచెం భయం వేస్తుందా…
అయితే
తప్పదు… గొంతెత్తండి
లేదూ ఇలాగే వదిలేద్దాం అంటారా.
Okkk!!
Let us pray for our children!!!



No comments