జిందగీ మిల్‌గయీ

జిందగీ మిల్‌గయీ 
#LifeIsCalling !!
జీవితం లో అత్యున్నతమైన క్షణాలు!!
గడచిన దారుల్లో మళ్ళీ నడవడం
కలల్ని కాలాన్ని తరచి తరచి చూసుకోవడం..
దాదాపు ముప్పై సంవత్సరాల పాటు తరచూ కలలోకి వచ్చిన చిన్నప్పటి జ్ఞాపకాలని మళ్ళీ చూసుకోవడం..
ఎంత గొప్ప అనుభూతి కదా
చిత్రకొండ!! ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి దాకా చదువుకున్న ఊరు.
ఆంధ్ర ఒడిషా బోర్డరులో బలిమెలా ప్రాజెక్ట్ ఏరియా. ఆ తర్వాత సీలేరు.
ఎప్పుడో చాలా యేళ్ళ కిందట ఒక అద్భుతమైన కాలం గడిపిన 
ఒక ఐదేళ్ళ అమ్మాయి
Alice in Wonder land!!
ఇదిగో ఇప్పుడా తీగలాగితే చిత్రకొండ కలలు కదిలాయ్.
అక్క చేయి పట్టుకుని చేమంతుల దారుల్లో మొదటి రోజు స్కూల్ కి వెళ్ళిన మొట్ట మొదటి జ్ఞాపకం.
గల గలా సీలేరు!!
ఆటవిక సోయగపు సీలేరు
గులక రాళ్ళ పరుపు మీద చల్లటి నీళ్ళలో పైపైనే తిరగాడుతున్న చిన్న చిన్న చేప పిల్లలు
నీటి సంగీతాన్ని, మబ్బుల సౌందర్యాన్ని, అడవి జీవితాన్ని చూసిందప్పుడే...
మళ్ళీ ఇన్నేళ్ళకు ఒక చిన్న సమీక్ష.
తెలి మబ్బుల చాయలో తొలి జ్ఞాపకాల కవాతు
ఐడెంటిఫికేషన్ పెరేడ్
నన్ను నేను దర్శించుకునేందుకు
బాల్యం- నాలోని సృజనాత్మతకు పునాది వేసిన ప్రకృతి!!
ఒక రోజంతా నే పెరిగిన, తిరుగాడిన.. పరిసరాల్లో సుడిగాలి పర్యటన చేసివచ్చాను.
మొదటి స్కూల్...అమ్మ నాన్న అక్క కాకుండ నా జీవితం లోకి వచ్చిన మొదటి స్నేహితురాలు శిల్ప Silpa Chinta. 
స్కూల్ లో "ఉందిలే మంచీ కాలం ముందూ ముందూనా" అంటూ మొదటి సారి చేసిన డాన్స్ ప్రోగ్రాం..
నన్ను మలచిన అదృశ్య ఉలుల అంచులను ప్రేమగా స్పృశించాను.
నడచిన దారుల్లో మళ్ళీ మళ్ళీ నడుస్తున్నప్పుడు...
అక్కడ గాలి చేసిన వేణుగానపు సవ్వడి...
అడవి వినిపించిన మాధుర్యపు పలకరింత
ఆ సంతోషాన్ని కొలిచే స్కేలుందా మీ దగ్గర!!

No comments