కొన్ని వాక్యాలు...

గులాబీల కొలిమిలో మగ్గినట్లుగా 
హృదయం 
తన పరిమళాన్ని మెరిపిస్తుంటే 
తడచిన పదాలని పొదువుకుంటూ 
కొన్ని వాక్యాలు 
తుమ్మెదల్లా వచ్చి 
నీలి కళ్ళలో వాలిపోతాయి .

అవంతే... 
వాటికి మాత్రమే తెలుసు, 
ఎందరికి సాదా సీదాగా అనిపిస్తేనేం ..
ఒక జీవితమంత విలువగా
ఎక్కడో... ఎవ్వరో... 
తమని దాచుకున్నారని


No comments