మహీ మ్యూజింగ్స్- 4
ఇప్పుడంటే గో గ్రీన్..
జీలకర్ర.. అని ఇన్ని రకాల మాటలొచ్చాయి గానీ.. మా చిన్నప్పుడు ఇవేం లేవు మాకు.
దసరా వెళ్ళిన దగ్గర్నుంచి దీపావళి హంగామా మొదలయ్యేది.
దీపావళి ఒక నాలుగు రోజులుందనగా కొబ్బరిబూరెలు వండేది అమ్మ. దీపావళికి తప్పని సరిగా బూరెలు వండేది. ఇన్ని రకాల రడీ మేడ్ స్వీట్లు కూడా అప్పుడు ఉండేవి కాదు కదా. పైగా మేం ఉండేది అచ్చమైన అడవిలాంటి ఒడిషా ఏజన్సీ ఏరియా .
ముందు రోజు బియ్యం నానేసేది అమ్మ. తర్వాత రోజు పొద్దున్నే నేను అక్క వెళ్ళి పిండి మరేయించుకొచ్చే వాళ్ళం.
వచ్చాక కింద రెండు మూడు పేపర్లు వత్తుగా పరచి, నాకూ అక్కకీ చెరో పిండి జల్లెడా ఇచ్చి జల్లించమని చెప్పేది అమ్మ. అసలు ఆ జల్లించడానికి ఎంత నేర్పు ఉండాలో తెలుసా. జల్లెడని అక్కడక్కడే గుండ్రంగా తిప్పాలి.. మధ్య మధ్యలో పిండి జల్లెడకి అతుక్కోకుండా కలుపుతూ ఉండాలి.
ఇక ఆ తతంగం అయ్యాక కొబ్బరి కోరడం మొదలయ్యేది. కేజీ పిండికి ఒక ముదురు కొబ్బరికాయ లెక్క. కాని మనం తిన్నది తినగా మిగిలిన కోరు అమ్మకి ఎలా లెక్క సరిపోయేదో తెలీదు. బూరెలు మాత్రం అద్భుతంగా వచ్చేవి. అసలు ఈ అమ్మలు అందరూ అంతే.
పండుగ మూడు నాలుగు రోజులుందనగా నాన్న గారు క్రాకర్స్ తెచ్చేవారు.
ఇక అక్కడి నుంచి మొదలయ్యేది హడావుడి. బయట ఒక మంచం వేసే వాళ్ళం. దాని మీద ఒక చాప. వాటి మీద మందు సామానులు అన్నీ ఎండ బెట్టే వాళ్ళం.
ఇక దీపావళి రోజు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఒకటే ఎదురు చూపులు. చీకటి పడి పడడంతోనే హడవుడి మొదలయి పోయేది.
పిల్లలకి కాటన్ డ్రస్సులు వేసి, హవాయి చెప్పులు వేసి బయటకి పంపేవాళ్లు. వరండా పక్కన నీళ్ళు నింపిన ఒక బకెట్ పెట్టేవాళ్ళు నాన్న గారు. కాల్చిన కాకర పువ్వొత్తులు అందులో వేయాలన్న మాట.
ఎవరిళ్ళలో వాళ్ళు కాసేపు కాల్చి సందు చివరకి చేరే వాళ్ళం. కాలనీ లో మగ పిల్లలంతా హీరోలయి పోయే వాళ్ళు. మా అక్క లాంటి హుషారైన అమ్మాయిలు కూడా.
తాటాకు టపాకాయలు, సీమ టపాకాయలు. సిసింద్రీలు నేల టపాకాయలు.
అసలు తాటాకు టపాకాయలు తెలుసా మన పిల్లలకి. సీమ టపాకాయలు థౌజెండ్ వాలా టెన్ థౌజెండ్ వాలా అంటూ ఒక సారి తగలెట్టడమే గానీ.. ఎడం చేత్తో ఒక అగరొత్తి పట్టుకుని, కుడి చేత్తో ఒక్కో సీమ టపాకాయ అంటించి విసిరేయడం ఎవరికైనా తెలుసా...
అసలు వీటన్నిటి కన్నా అదిరిపోయే హుషారు ఏమిటో తెలుసా.. తుపాకీ రీళ్ళు. అసలు వీటిని తుపాకీ తో కాలిస్తే మజా ఉండదు తెలుసా...
ఒక మాంచి ఇటుక రాయి తెచ్చి.. రీలు మొత్తం పెట్టకుండా... ఒకటి ఒకటీ కత్తిరించి ఒక్కో దెబ్బకీ... ఢాం ఢాం అని కొడుతుంటే ఉంటుందీ...
చెప్పాగా అప్పట్లో ఈ ఎకో దీపావళిలూ... హరిత హారాలూ.. లేవు
దసరా వెళ్ళిన దగ్గర్నుంచి కార్తీక పౌర్ణమి దాకా తుక్కు రేగ్గొట్టడమే పని.
ఇప్పుడా సరదాలు ఏమున్నాయ్.
అపార్టుమెంట్లలో సీరియల్ లైట్లు వెలిగించి వాట్సప్పుల్లో బ్లూలైన్ మెసేజులు చెప్పేసుకున్నాం.
అయినా...
ఒక దీపావళి నేలపై చేసే కాలుష్యం కన్నా...
రోజూ వారీగా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే కాలుష్యం ఎక్కువ అని మనం చాలా 'అమాయకం'గా మర్చిపోతాం.
మన మనసులోని నరకాసురుడు... బకాసురిడిలా లోకం మొత్తాన్నీ రోజూ కొంచెం కొంచెంగా నంజుకు తినటం మాత్రం నాగరికమని సాకులు రాసేసుకుంటాం.
అసలంటూ మన మనసులోని పొల్యూషన్ని తరిమేస్తే... ప్రతి రోజూ ఎకో దీపావళియే కదా...

Post a Comment