JEAN PAUL SARTRE!!!
I am alone in the midst of these happy, reasonable voices. All creatures spend their time explaining, realizing happily that they agree with each other. In heavens name, why is it so important to think the same things all together!!!
JEAN PAUL SARTRE-- NAUSEA.
ఏదో ఒక రకంగా మనమూ జీవించాం... అనుకోవడం కోసం.. ఏదో ఒక విషయంలో మనకి మనమే నచ్చచెప్పుకుంటూ… చాలాసార్లు ఏదో ఒక విషయంలోనో, కొన్ని సార్లు అన్ని విషయాలలోనూ... సర్దుకుపోతూ… మనకంటూ మనం మిగలకుండా అసలు ఇలా జీవించడం అవసరమా... తల్చుకుంటే ఎంత వికారం!!
నిజానికి మన ఆనందానికి బయటి అడ్డంటూ ఏది ఉన్నా దాన్ని తొలగించుకోవటం ఎంత సులభమైనా, వేరొకరి అస్తిత్వంలో మనకంటూ ఉన్నత స్థానముండాలనే పిచ్చి భ్రమలో మనం కోల్పోతుంది ఒక్కటే...అదే మన అస్తిత్వం.
ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తముసుగుతో బయటి వారికి కనిపించినంత మాత్రాన… మన అద్దంలో కనిపించే నిజరూపాన్ని మనది కాదంటూ మభ్య పెట్టుకోవటం మన అస్తిత్వానికి మనమే వేసుకుంటున్న సంకెళ్ళు కాదా?
సార్త్రె రాసిన "NAUSEA" పుస్తకం. నాకంటూ ఒక అస్తిత్వం కావాలని, ఉందనీ వెతుక్కుంటున్న రోజుల్లో.. అస్తిత్వ వాదాన్ని పరిచయం చేసి మనసుకీ ఆలోచనలకీ ఒక రూపం ఇచ్చిన పుస్తకం.
ఒక వ్యక్తి తన జీవితానికి ఒక అర్ధాన్ని ఇచ్చుకుని అటువంటి జీవితాన్ని నిజాయితీగా నిష్టగా బతకడంలో సమాజానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు.అలా జీవించడానికి ఆ వ్యక్తికి సంపూర్ణ స్వాతంత్రం ఉంది. "ఎగ్జిస్టెన్స్ ప్రీసీడ్స్ ఎసెన్స్” అంటాడు సార్త్రె. అన్నింటి కన్నా ముందు మనిషి స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకవలసిన జీవి. ఆ తర్వాతే అతనికున్న బహురూపాలూ, సిద్ధాంతాలూ, నమ్మకాలూ, విశ్వాసాలూ,అన్నది సార్త్రె మూల భావన. ఈ భావననే అస్తిత్వ వాదంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు సార్త్రె.
"NAUSEA!!", సార్త్రె రాసిన మొట్టమొదటి నవల. ప్రపంచపు అత్యుత్తమ నవలలలో ఒకటి. తన స్వంత ఉనికికి తానే భయపడే ఆంటోనీ రాక్వెంటిన్ అనే ఫ్రెంచ్ రచయిత కధ ఇది. ఆంటోనీ రాసుకున్న డైరీ రూపంలో ఉండే ఈ నవలలో బూర్జువా భావజాలంతో నిండిపోయిన ఈ నిర్ధాక్షిణ్యపు వ్యవస్థ గురించి తన భావనలను, మానసిక సంచలనాలనూ అత్యంత సహజంగా చెప్తారు సార్త్రె.
తన జీవితాంతం నిజమైన స్వేచ్ఛ కోసం తపించి జీవించిన వ్యక్తి ఆయన. " NAUSEA" పుస్తకంలో ప్రతీ అక్షరంలోనూ కనిపించే ఆయన స్వేచ్ఛాపిపాస, ఆంతరంగిక భావ సంచలనాలూ మనల్ని ఒక్క కుదుపు కుదిపేస్తాయి.
All that is missing is the independence not to choose anything…
నిజమే కదా.. జీవితంలో మనం ఎన్నుకోవడానికి అనేక మార్గాలుంటాయి. లేనిదల్లా ఎంపిక చేసుకోనక్కరలేని.. మనదైన జీవితం. అదే అస్తిత్వం మనదైన ఉనికి.
ఎంత బాగా చెప్పాడు సార్త్రె..
Post a Comment