నువ్వూ.. నేనూ
ఖిల్‌తే హై గుల్ యహా...
ఖిల్ కె బిఖర్ నె కో...
మిల్‌తే హై గుల్ యహా...
మిల్‌కే బిఛడెనే కో...
బయట వెన్నెల కురుస్తోంది.
ఆకుపచ్చని నీడల మధ్య నుంచి చూస్తుంటే ఇంత వేసవి కాలం కూడా…
వెన్నెల మంచులానే ఉంది.
కిటికీ లోంచి బయటకి చూసానా.. పూలు లేని పారిజాతం చెట్టు..
ఒకే ఒక్క దృశ్యం.
జన్మ జన్మలకూ మర్చిపోలేని జ్ఞాపకం.
ఎవరన్నారు యారా...
జ్ఞాపకాలు మధురాతి మధురమని.
గుర్తుకొచ్చినప్పుడల్లా అవి గడచిన దినాలని,
ఇప్పుడదంతా ఒక కల మాత్రమేననీ..
ఇక ఆ క్షణాలను తిరిగి జీవించడం అసాధ్యమనీ
ఇలా చెప్పి భాదించే జ్ఞాపకాలని మధురస్మృతులని ఎలా పిలవాలి???
ఇదిగో ఈ వేసవీ, వర్షం.. అవగానే మంచు వస్తుందనీ...
ఆ మంచులో నువ్వు మళ్ళీ తెల తెల్లగా...
మనసు నింపే అరోమాతో వచ్చేస్తావని మనసు సర్ది చెప్పుకోవడం తప్ప ఏం చేయగలను నేను.
కిషోర్ కుమార్ ఏమంటున్నాడో చూడు..
కల్ రహే నా రహే
మౌసం యే ప్యార్ కా
కల్ రుకె నా రుకె
డోల బహార్ కా...
నిజమే యారా..
రేపుంటుందో లేదో ఎవరికి తెలుసు.
ఉంటేనేగా జ్ఞాపకాలుగా భాదో సంతోషమో ఏదో ఒకటి పెట్టేది మనల్ని..
రా ఒక్క సారి..
మనకి దొరికిన ఈ నాలుగు క్షణాల్నీ.. ప్రేమలో ముంచేద్దాం..
దోసిటతో ఎంత వెన్నెలని పోసుకుని తాగినా ఈ దాహం తీరట్లేదు.
ఒక చల్లని నవ్వు ఇవ్వు.
జ్ఞాపకాలే లేని…
నిరంతర ఏకాంతంలో యథేచ్చగా ఈదులాడేలా
నిరాకారకాలంలోకి ఇంకిపోదాం
అవునూ...
నన్ను నేను ప్రకటించుకున్న ప్రతి క్షణమూ
నువ్వు వెల్లడవ్వటంలో నా గొప్పేం ఉంది చెప్పూ
కాలమంతా వెదికి నా కోసం రాసుకున్న స్వేచ్ఛవి నువ్వు
గాలిలో గిరికీలు కొడుతున్న కట్టకడపటి గానాన్ని
నా కోసం ఆలపించే నీ మంత్రస్వరాన్ని వింటూ
ఆకుపచ్చని గరికనై
నీ పాటవాటుగా కొట్టుకుపోయే అమాయకత్వాన్ని నేను

Post a Comment