వనవాసి

ఎంత గాఢ ప్రశాంతత!
ఎంత అద్భుతమైన ఏకాంతం!!!
చాలా సార్లు ఏకాంతం భలే ఉంటుంది...
అందులోనూ.. శరత్‌కాలపు చల్లని వెన్నెల..
ఇలా బాల్కనీలో కూర్చుని, రావి చెట్టు ఆకుల్లోంచి తొంగి చూస్తున్న చందమామకి హాయ్ చెప్తూ..
ఒక అద్భుతమైన పుస్తకం చదువుతుంటే.. ఆ అనుభూతే వేరు!
వనవాసి!!
ఎన్ని సార్లు చదివినా.. ప్రతీ పున్నమికీ నన్ను ఆవహించే పుస్తకం.
ప్రకృతితో గొప్ప పరిచయం,
ఆ పరిచయంలో మనం పొందే ఆనందం..
ఆ ఆనందంలో ఉన్న అవ్యక్త రహస్యం ఇవన్నీ అనుభవించాలంటే వనవాసి చదవాల్సిందే!!!
ప్రకృతి వడిలో ఒక సాధారణ మానవుడు ఏం నేర్చుకోగలడు??
ఆ అనుభవంతో అతని వ్యక్తిత్వం ఎంత ఉత్కృష్టంగా మారగలదు??
ఎంత లోతైన జీవిత సత్యాలను నేర్పగలదు??... వీటికి సమాధానం సత్యచరణ్ పాత్రలో మనకి దొరుకుతుంది.
వనవాసి చదివాక చాలాకాలం మన ఆలోచనల్లో దుధులీ పుష్పాల మదుర వాసనలూ..
రక్త ఫలాశ వృక్షాల శోభ..
పత్ర విహీనమైన గోల్‌గోలీ పువ్వులు..
వెన్నెల రాత్రులూ,
సెలయేటిలో అడవి లిల్లీల మృధుమధుర పరిమళాలూ... వెంటాడుతూ ఉంటాయి..
వనవాసి చదివాక.. ప్రకృతి అందాలతో పాటుగా..
ఆ తర్వాత వెంటాడే యధార్ధ జీవిత వ్యధార్ధ దృశ్యాలు..
అడవుల మనుగడ పట్ల రేగే ఆలోచనలు....
మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలూ...
అన్నానికి రొట్టెలకూ కూడా నోచుకోక గడ్డిగింజలూ, పచ్చిపిండి తినే దృశ్యాలూ..
ఒక్క రొట్టె ముక్క కోసం పన్నెండు మైళ్ళు నడిచే పేదలూ... వారిని దోచుకు తింటున్న భూస్వాములూ...
......
ఇవన్నీ భరించే శక్తి మన మనస్సుకి ఉండాలి!!!
ఆనందాన్ని దుఃఖాన్ని ....
వేదననీ హాయినీ..
ఒకేసారి కలిగించే భావనని మన మనసు భరించగలగాలి...
అలా అయితే ... తప్పకుండా చదవండి.. మస్ట్ రీడ్ బుక్....

No comments