వానొస్తద..
ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని వర్షాలైనా చూడనీ..
ప్రతీ చినుకూ కొత్తేనాకు. వానలో ఉన్న అందం అది.

ఇప్పుడైతే మరీ.
ఎందుకంటే, ఇలా ఒకానొక వర్షం కురిసిన సాయంత్రమే చినుకు అందం తెలిసింది నాకు.
ఇలా ఒడిసి పట్టే ప్రతీ చినుకూ ఒక చెలిమి స్పర్శని నాకోసం తెచ్చిస్తున్నట్లే ఉంటుంది.

వర్షం కురవబోతున్న ఈ సాయంత్రం..
అమావాస్య చీకటిని తొలుచుకుని తెల్లటి మేఘాలు తరుముకొస్తున్న ఈ సాయంత్రం....
తడి తడిగా నేలని తొలచుకుంటూ వస్తున్న చిగురాకు పచ్చని సంగీతం..
అనుభూతుల సవ్వడిని అద్దుతూ పారిజాతాల సువాసన
నీ రాకని గుర్తు చేస్తున్నాయి నాకు.
ఎక్కడున్నావ్ నువ్వు.
గడచిన ప్రతీ క్షణం మన దోసిలిలోంచి జారిపోయిన జ్ఞాపకమేనని తెలుసా నీకు.
మళ్ళీ వర్షం వస్తుంది.
చినుకు చినుకునూ పెనవేసి నీటి అద్దాల దారిని వేస్తుంది…
అందులో నుండి సన సన్నని వేడుకగా మొదలవుతూ నీ నవ్వు కనిపిస్తుంది.
అప్పుడనిపిస్తుంది…
ఎప్పటికీ ఈ సాయంత్రాన్నిలా దాచేసుకోవాలని
ఇలాంటి ఒక అందమైన సాయంత్రం మళ్ళీ మళ్ళీ రావొచ్చు
కానీ గడచిపోయిన ఈ రోజైతే మళ్ళీ రాదు కదా.

Post a Comment