ఆమె... అతడు


ఆమె....
ఆకాశ హర్మ్యం ఎక్కి
చుక్కల పువ్వుల్ని తెంపి
జల జలా మనసులో పోసి...
అతని వంక చూసి గల గలా నవ్వుతుంది.
అతను...
హృదయంలో గుత్తులకొద్దీ
అక్షర సుమాల్ని పూయించి
కవితా మాలలల్లి...
ఆమె మెడలో వేస్తాడు.
అతను కాసేపటు తిరిగిన క్షణంలోనే
ఆమె తన ఆశలకి ఊహల్ని పూసి
అతనికి తొడిగి మురిసి పోతుంది
ఆమె చూపు మరల్చగానే
అతను ఆమెకి తనని అలంకరించి
పరవశించి పోతాడు
ఆమె నడుస్తుంటే
ఆ పాదం కింద అరచేయి అవుతాడతను
ఆమేమో ఆ చేయి కింద
హృదయంతో సహా విస్తరించి పోతుంది.
ఆమె… అతడు
ఆసాంతం
ఒకరికొకరు అనంతం..

1 comment

WHAT'S HAPPENING said...
This comment has been removed by the author.